కంకర మిల్లులపై విజి‘లెన్స్‌’

ABN , First Publish Date - 2020-09-29T11:22:39+05:30 IST

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వ్వాపారులపై విజిలెన్స్‌ కొరడా ఝుళిపి స్తోంది. సోమవారం మార్టూరు, నాగరాజుపల్లి పరిధిలో గల కంకర మిల్లులపై దాడులు చేసి నిబంధనలు అతిక్ర మించిన మిల్లుల యజమానులపై చర్యలు తీసుకో వలసిందిగా మైనింగ్‌ అధికారులుకు లేఖరాశారు.

కంకర మిల్లులపై విజి‘లెన్స్‌’

 మార్టూరు, నాగరాజుపల్లిలో సోదాలు

ఒంగోలు(క్రైం), సెప్టెంబరు 28: ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వ్వాపారులపై విజిలెన్స్‌ కొరడా ఝుళిపి స్తోంది. సోమవారం మార్టూరు, నాగరాజుపల్లి పరిధిలో గల కంకర మిల్లులపై దాడులు చేసి నిబంధనలు అతిక్ర మించిన మిల్లుల  యజమానులపై చర్యలు తీసుకో వలసిందిగా మైనింగ్‌ అధికారులుకు  లేఖరాశారు. అదే విధంగా ఒంగోలులో  అరవై అడుగుల రోడ్డులోని గజా నంద్‌ మొబైల్‌ స్పేర్‌ పార్ట్స్‌, పూజా మెబైల్‌ యాక్సరీస్‌లలో  అధికారులు తనిఖీలు నిర్వహించారు.


అక్కడ స్పేర్‌ ప ర్టులను జీఎస్టీ చెల్లించకుండా అధిక ధరలకు విక్రర ుుంచడాన్ని గుర్తించారు. రికార్డులు స్వాధీన పర్చుకు న్నారు.  వారిపై నివేదికను వాణిజ్వ పన్నుల శాఖకు పంపిచనున్నట్లు విజిలెన్స్‌ డీఎస్పీ తెలిపారు. విజిలెన్స్‌ రీజనల్‌ అధికారి కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహి స్తున్నామన్నారు. తనిఖీలలో విజిలెన్స్‌  ఇన్‌స్పెక్టర్లు  శ్రీనివాసరావు, బి.వి.వి.సుబ్బారావు, బీటీ నాయక్‌, మైనింగ్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌  రవికుమార్‌ పాల్గొన్నారు. 


ఏలూరిని కలిసిన ..ఇంకొల్లు నాయకులు

ఇంకొలు :  ఎమ్మెల్యే ఏలూరిని ఇంకొల్లు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం ఇసుక దర్శి క్యాంపు కార్యాలయంలో కలిసి అభినందనలు తెలియజేశారు. మాజీ జడ్‌పీటీసీ సభ్యులు వీరగంధం ఆంజనేయులు, గుంజి వెంకటరావు, బొడెంపూడి సుబ్బారావు, కరి శ్రీనివాసరావు,సంధ్యారాణి తదితరులు ఉన్నారు.


గృహ దహనంపై కేసులు నమోదు

తాళ్లూరు, సెప్టెంబరు 28 : రజానగరం గ్రామంలో సుబ్బారెడ్డి హత్య కేసులో నిందితుడు కే.వెంకటేశ్వర్లు గృహాన్ని దహనం చేసిన ఘటనపై స్థానిక పోలీస్‌ స్టేషనులో కేసు నమోదు చేసినట్లు  ఎస్సై ఏమినేని.నాగరాజు సోమవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం కొందరు గ్రామస్థులు వెంకటేశ్వర్లు ఇంటికి తాళం వేసి వుండగా తలుపులు పగలగొట్టి ఇంటిలోనికి ప్రవేశించి సామానులను బయటపడవేసి తగల బెట్టారు. సమాచారం అందుకున్న దర్శి సిఐ ఎండి మొయిన్‌, ఎస్‌ఐ నాగరాజులు గ్రామాన్ని, దగ్ధమైన గృహాన్ని పరిశీలించారు. గ్రామస్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని గృహాన్ని దహనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహాన్ని దహనం చేసిన ఘటనపై సుబ్బారెడ్డి బంధువులు, మరి కొందరిపై కేసు నమోదు చేశారు.


రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఒంగోలు(క్రైం), సెప్టెంబరు 28: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం ఉలవపాడు సమీపంలో రైల్వే ట్రాక్‌పై జరి గింది. సుమారు 35 ఏళ్ల వయస్సు గల వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ ఎంజే.కిషోర్‌ బాబు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

భార్యపై భర్త కత్తితో దాడి 

చీరాలటౌన్‌, సెప్టెంబర్‌ 28 : భార్యని భర్త కత్తితో పొడవగా ఆమెకు పొట్టలో తీవ్ర రక్తగాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అవుట్‌పోస్ట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం మల్లాయిపాలెంకు చెందిన నన్నేసాహెబ్‌, రంజని దంపతులు. వీరికి సుమారు 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇరువురు పిల్లలు  ఉన్నారు. మూడు సంవత్సరాలుగా నన్నేసాహెబ్‌ భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు.


ఈనేపథ్యంలో సుమారు 20 రోజుల క్రితం ఆమె కారంచేడులోని సోదరి బాజీ వద్దకు వచ్చింది. దీంతో భర్త సాహెబ్‌ కాపురానికి రమ్మని సోమవారం వచ్చి అడగగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన అతను కత్తితో పొట్టలో పొడిచాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తగాయమైంది. కుటుంబ సభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈమేరకు పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.


రైల్వే గేటును పరిశీలించిన కమిటీ

సూరారెడ్డిపాలెం(టంగుటూరు), సెప్టెంబరు 28 : సూరారెడ్డిపాలెం రైల్వే గే టు వద్ద అండర్‌ బ్రిడ్జి నిర్మాణ ఆవశ్యకతను రైల్వే జాయింట్‌ తనిఖీ కమిటీ, ఒం గోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ మా దాసి వెంకయ్య సోమవారం పరిశీలించారు. సూరారెడ్డిపాలెం రైల్వే గేటు వద్ద రైల్వే వోవర్‌ బ్రిడ్జి నిర్మించాలని ఇటీవల మాగుంట శ్రీనివాసులరెడ్డి రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి విన్నవించారు. అక్కడ బ్రిడ్జి లేని కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, గేటు నుంచి రాకపోకల విషయమై ప్ర యాణికులు,  ప్రజలు అవస్థలు పడుతున్నారని మంత్రికి వివరించారు.


రైల్వే బ్రిడ్జి అవసరాన్ని తెలుసుకున్న మంత్రి ప్రస్తుత పరిస్థితుల్లో వోవర్‌ బ్రిడ్జి మం జూరు సాధ్యం కాదని, అండర్‌ బ్రిడ్జికి తన సమ్మతి తెలియజేశారు. అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి అక్కడి పరిస్థితుల పరిశీలనకు రైల్వే శాఖ ప్రత్యేకంగా జా యింట్‌ ఇన్‌స్పెక్షన్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సోమవారం గేటు వద్ద కు వచ్చింది. మాగుంట, వెంకయ్య రైల్వే అండర్‌ బ్రిడ్జి ఆవశ్యకతను కమిటీకి వి వరించారు. బ్రిడ్జి లేక పడుతున్న ఇబ్బందులను స్థానికులు తెలియజేశారు.  


Updated Date - 2020-09-29T11:22:39+05:30 IST