తెలుగుదేశం పార్టీ ‘సంస్థాగత’ సందడి

ABN , First Publish Date - 2020-10-27T07:00:43+05:30 IST

తెలుగుదేశం పార్టీలో సంస్థాగత సందడి మొదలైంది. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది.

తెలుగుదేశం పార్టీ ‘సంస్థాగత’ సందడి

29, 30, 31 తేదీల్లో పర్చూరు నియోజకవర్గ మండల కమిటీ సమావేశాలు

బాపట్ల పార్లమెంట్‌ నియోజకర్గ టీడీపీ అధ్యక్షుడు ఏలూరి


పర్చూరు, అక్టోబరు 26 : తెలుగుదేశం పార్టీలో సంస్థాగత సందడి మొదలైంది. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తొలుత పర్చూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి, ఆ తర్వాత పార్లమెంట్‌ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టనున్నారు. గ్రామ స్థాయిలో సంస్థాగత నిర్మాణానికి షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఇప్పటికే నియోజకవర్గ, మండల స్థాయి పరిశీలకులను నియమించారు. గ్రామాల ముఖ్య నాయకులతో మండల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ, మండల స్థాయిలో పార్టీ ఎన్నికల ప్రణాళిక, రూపకల్పన, గ్రామకమిటీల నిర్మాణం చేపట్టనున్నట్లు సోమవారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు.


ఈ నెల 29, 30, 31 తేదీలలో పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలోని మండల కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ కమిటీలను 5 రోజుల్లో పూర్తిచేస్తామన్నారు. 29 ఉదయం 10 గంటలకు మార్టూరు మండల కమిటీ సమావేశం, సాయంత్రం 3గంటలకు యద్దనపూడి సమావేశం జరుగుతుందన్నారు. 30న ఉదయం 10గంటలకు చినగంజాం, సాయంత్రం 3గంటలకు ఇంకొల్లు, 31వ తేదీ ఉదయం 10 గంటలకు పర్చూరు, సాయంత్రం 3గంటలకు కారంచేడు మండల కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమాలకు పరిశీలకులుగా గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు సలగల రాజశేఖర్‌బాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కె. కరిముల్లా, గుంటూరు జిల్లా పార్టీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నలజాల శ్రీనివాసరావులు హాజరు కానునున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవ్వాలని ఆయన కోరారు.

Updated Date - 2020-10-27T07:00:43+05:30 IST