ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-10-28T09:52:26+05:30 IST

గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కుందుకు నాగార్జునరెడ్డి సచివాలయ సిబ్బందికి సూచించారు.

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

 ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి 


కొనకనమిట్ల, అక్టోబరు 27 : గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే కుందుకు నాగార్జునరెడ్డి సచివాలయ సిబ్బందికి సూచించారు. మండలంలోని గార్లదిన్నెలో మంగళవారం నిర్వ హించిన సచివాలయ దర్శినిలో ఆయన మాట్లా డారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలను త్వరి తగతిన అందించాలన్నదే సచివాలయాల ఏర్పాటు ముఖ్య ఉద్దేశమన్నారు. అందుకు అనుగుణంగా పని చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథ కాల లబ్ధిని గంటల వ్యవధిలోనే అర్హులకు అందేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రధా నంగా తాగునీటి సమస్యను ప్రస్తావించారు.


వర్షాలు సం వృద్ధిగా కురిశాయని చెప్తూ అధికారులు ట్యాంకర్లను త గ్గించి వేశారన్నారు. వాస్త వా నికి తమ గ్రామంలో త క్కు వ వర్షం పడిందని, బోర్లు కూడా పని చేయడం లేదని వారు చెప్పారు. దీంతో నీటికి తీవ్ర ఇబ్బందులు ప డుతు న్నామని, ట్యాంకర్ల సంఖ్యను పెంచి సమస్యను ప రిష్కరించాలని కోరారు. వీఆర్వో సక్రమంగా విధులకు హాజరు కావ డం లేదని, పనులు చేయ డం లేదని కొందరు రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చే శారు. కార్యక్రమంలో ఈవోఆర్డీ రాజకుమారి, వైసీపీ నాయకుడు సానికొమ్ము తిరపతిరెడ్డి, పంచాయతీ రాజ్‌  ఏఈ నిరంజన్‌, పలువురు అధికారులు, సచి వాలయ సిబ్బంది  పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-28T09:52:26+05:30 IST