రాజధాని రైతుల అరెస్టు అన్యాయం

ABN , First Publish Date - 2020-10-30T11:14:03+05:30 IST

అమరావతి రాజధాని కోసం భూ ము లు ఇచ్చి, త్యాగాలు చేసిన రైతులను అరెస్టు చేయడం దుర్మార్గ మైన చర్య అని టీడీపీ నాయకులు దొడ్డా వెంకట సుబ్బా రెడ్డి, బేరిపుల్లారెడ్డి ధ్వజమెత్తారు.

రాజధాని రైతుల అరెస్టు అన్యాయం

బేడీలు వేసుకొని టీడీపీ శ్రేణుల నిరసన 


కనిగిరి, అక్టోబరు 29: అమరావతి రాజధాని కోసం భూ ము లు ఇచ్చి, త్యాగాలు చేసిన రైతులను అరెస్టు చేయడం దుర్మార్గ మైన చర్య అని టీడీపీ నాయకులు దొడ్డా వెంకట సుబ్బా రెడ్డి, బేరిపుల్లారెడ్డి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం  తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బేడీలు, సంకెళ్లు వేసుకొని, ప్లకార్డులు చేత బూని వినూత్నంగా నిరసన కా ర్యక్ర మం చేపట్టారు. టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు కనిగిరి, హనుమం తుని పాడు, వెలిగండ్ల, సీఎస్‌పురం, పామూరు, పీసీపల్లి మండలాల్లో టీడీపీ శ్రేణులు రాజధాని రైతులపై వైసీపీ సర్కార్‌ తీరును నిరసిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు.  నాయకులు మాట్లాడు తూ రాజధాని కోసం భూము లిచ్చిన రైతుల చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లడం చూస్తుంటే రాష్ట్రంలో అరాచక పా లనకు అ ద్దంపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కన్నీ రు రాష్ర్టానికి అరిష్టమన్నారు.  ఈ దుశ్చర్యకు పాల్పడినవారిని కఠి నంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ తహసీల్దార్‌కు విన తిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తమ్మి నేని వెంకటరెడ్డి, పెన్నా నాగయ్య, షేక్‌ బుజ్జా, ముంగమూరి బాలు, శ్రీను, మస్తాన్‌, సురేంద్ర, జిలానీ, చిలకపాటి బ్రహ్మం, ఫిరోజ్‌, సురేష్‌, శ్రీరాం  పాల్గొన్నారు. 


హనుమంతునిపాడు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట టీ డీపీ మండల అధ్యక్షుడు గాయం తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నిర సన కార్యక్రమం జరిగింది.  కార్యక్రమంలో  రఘునాథ కాశిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


వెలిగండ్ల : అమరావతిని నాశనం చేయాలనే ఏకైక లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయ సీని యర్‌ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో  వెంకటరెడ్డి, ఇంద్రభూపాల్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సలోమన్‌రాజు, మస్తాన్‌రెడ్డి, పండు, శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.

 

పామూరు : రాజధాని రైతులకు బేడీలు వేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ శ్రేణులు తహ సీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం నిరసన కార్యక్రమం చేప ట్టారు. కార్యక్రమంలో జిల్లా షీప్‌ సొసైటీ డైరెక్టర్‌ గంగరాజు యాదవ్‌, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బీవీ భోజయ్య చారి, షేక్‌ ఖాజా రహంతుల్లా, సయ్యద్‌ అమీర్‌బాబు, గడ్డం రామారావు తదితరులు పాల్గొన్నారు.

 

సీఎస్‌పురం : సీఎస్‌పురంలో టీడీపీ నాయకులు నిరసన కా ర్యక్రమం చేపట్టారు.  అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ జి.ఆంజ నేయులకు వినతిపత్రం  అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నా యకులు బొబ్బూరి రమేష్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యులు  హాజీ మలాన్‌, పఠాన్‌ నాయబ్‌ రసూల్‌, ఓర్సు ఆదినారాయణ, మన్నే పల్లి శ్రీనువాసులు, ఆర్‌కె.వలి, శ్రీను, కోనంకి శ్రీరాములు, తిరుపతయ్య, వెంకటరాముడు, మహాబూబ్‌ బాషా పాల్గొన్నారు. 


దర్శి : రాజధాని రైతులపై అక్రమ కేసులు పెట్టి, బేడీలు వే యడం దారుణమని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.  వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీడీపీ నాయకులు గురువారం తహసీల్దార్‌ వీడీబీ వరకుమార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బి.బాలయ్య, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంగా తిరుపతిరావు, టీడీపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చలమయ్య తదితరులు పాల్గొన్నారు.


అమరావతి రైతులపట్ల వైసీపీ దారుణంగా వ్యవహరిస్తోందని టీడీపీ జిల్లా లీగల్‌సెల్‌ అధ్యక్షుడు పరిటాల సురేష్‌ ధ్వజమెత్తారు.  తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో  నిరసన చేపట్టారు. కార్యక్రమంలో ఆర్‌.మోషే, వెంకటరావు, ఖాశిం, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:14:03+05:30 IST