గ్రామ కంఠం ఆక్రమణ

ABN , First Publish Date - 2020-10-30T11:17:40+05:30 IST

ప్రభుత్వ భూములపై కన్నేసిన ఆక్రమణదారులు గ్రామ కంఠం స్థలాన్ని కూ డా వదలలేదు.

గ్రామ కంఠం ఆక్రమణ

 ప్రభుత్వ స్థలంలో పాతిన బోర్డును పీకేసిన

 ఆక్రమణదారులు

 యథేచ్ఛగా ఇంటి నిర్మాణాలు 


పీసీపల్లి, అక్టోబరు 29 : ప్రభుత్వ భూములపై కన్నేసిన ఆక్రమణదారులు గ్రామ కంఠం స్థలాన్ని కూ డా వదలలేదు. గ్రామ కంఠం స్థలంలో అధికా రులు  ఏర్పాటు చేసిన బోర్డును సైతం పీకేసి దర్జాగా ఇళ్ల ని ర్మాణాలు చేపడుతున్నారు. గతంలో ఈ స్థలంపై కన్నేసిన మరో వర్గం అడ్డుకోవడంతో  ఆక్రమణ విష యం ఆలస్యంగా వెలుగుచూసింది.  వివరాల్లోకి వెళితే.. మండలంలోని అన్నపురెడ్డిపల్లి కొత్తపల్లి సర్వే నెంబర్‌ 870లో 11 ఎకరాల గ్రామ కంఠం స్థలం ఉంది. ఆ స్థలానికి ఆనుకునే ఇర్ల పాడుకు  చెందిన ఓ వ్యక్తికి పొలం ఉంది. తన పొలం పక్కనే ఉన్న ఈ భూమిని ఆక్రమించుకునేం దుకు గతంలో ఓ వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో అదే గ్రామానికి చెందిన మరోవర్గం వారు ఆక్రమణకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తహసీల్దార్‌ సింగారవు ఆదేశాల మేరకు గ్రామ కంఠం స్థలంలోకి ఎవరూ రావద్దని వీఆర్వో సుబ్బారావు బోర్డును ఏ ర్పాటు చేశారు.  గురువారం గతంలో ఎవరైతే ఆక్రమణలు అడ్డుకున్నారో వారే తాజాగా స్థలాన్ని ఆక్ర మించుకొని ఇళ్లు నిర్మించుకునేందుకు బ్రిక్స్‌తో గోడ కట్టిస్తున్నారు.


దీంతో అవతలి వర్గమైన (గతంలో ఆక్రమించేందుకు యత్నించిన ఓ వ్యక్తి) అప్పుడు తనను అడ్డుకొని ఇప్పుడు మీరెలా ఆక్రమించి ఇంటి నిర్మాణానికి దిగారంటూ ఘర్షణకు దిగాడు. విషయం తె లుసుకున్న గ్రామ సచివాలయ సిబ్బంది ని ర్మాణాన్ని అడ్డుకున్నారు. సచివాలయ సిబ్బంది ఉన్నంత సేపు నిర్మాణాలు ఆపిన  ఆక్రమణదారుడు సి బ్బంది వెళ్లిపోగానే తిరిగి ఇంటి నిర్మాణం మొదలు పె ట్టాడు.


దీంతో  రెవెన్యూ సిబ్బంది రంగప్రవేశం చేసి నిర్మాణాలను నిలిపివేశారు. గతంలో ఇదే పంచా యతీ పరిధిలోని పెదఇర్లపాడులో పాఠశాల స్థలాన్ని, రోడ్డును ఆక్రమించి దుకాణాలు నిర్మించగా అధికారులు వాటిని తొలగించక పోవడంతోనే ప్రభుత్వ స్థలాలను ఆ క్రమణదారులు ఆక్రమిస్తున్నారని, ఇకపై ఆక్ర మణలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవా లని గ్రామ స్థులు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-30T11:17:40+05:30 IST