కొనసాగుతున్న సీఐడీ తనిఖీలు

ABN , First Publish Date - 2021-04-16T04:40:54+05:30 IST

మండలంలో చినమేరంగి సీహెచ్‌సీ లో గురు వారం మధ్యాహ్నం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిం చారు. సీఐడీ సీఐ ఎ.పార్థసారథి ఆధ్వర్యంలో రికార్డులు పరిశీలించారు.

కొనసాగుతున్న సీఐడీ తనిఖీలు
జియ్యమ్మవలస: రికార్డులను పరిశీలిస్తున్న సీఐడీ ఎస్‌ఐ అప్పలరాజు

జియ్యమ్మవలస, ఏప్రిల్‌ 15: మండలంలో చినమేరంగి సీహెచ్‌సీ లో గురు వారం మధ్యాహ్నం సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిం చారు. సీఐడీ సీఐ ఎ.పార్థసారథి ఆధ్వర్యంలో రికార్డులు పరిశీలించారు. 2015-18 మధ్య కాలంలో పరికరాలు కొనుగోలు, వారంటీ కాలం, పరికరాల కొనుగోలు చేసిన కంపెనీయే రిపేరు చేయాల్సి ఉండగా వేరే కంపెనీకి ఎందుకు అప్పగించారన్న దానిపై విచారణ చేపట్టారు. ఎల్విన్‌ పేట, నీలకంఠాపురం, మొండెంఖల్‌, కురుపాం, జియ్యమ్మవలస పీహెచ్‌సీల్లోనూ తనిఖీలు నిర్వహించారు. వైద్యాధికారి కమలకుమారి, సీఐడీ ఎస్‌ఐ అప్పలరాజు, సిబ్బంది పాల్గొన్నారు.   గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పార్థసారథి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గతంలో ఆసుపత్రికి వచ్చిన మెడికల్‌ పరికరాలు, తదితర వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.  బాడంగి: స్థానిక సీహెచ్‌సీలో 2015-2018 మధ్య కాలంలో కొనుగోలు చేసిన బయోమెడికల్‌ పరికరాల విషయమై దర్యాప్తు చేస్తున్నామని సీఐడీ సీఐ రమణ  తెలిపారు.  ఆసుపత్రిలో మౌలిక వసతులు, పరికరాల కొనుగోలు, వాటి మరమ్మతులకు బిల్లులు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయన్నారు. దీనిపై ఫిర్యాదు రావడంతో విశాఖ నుంచి బృందంగా విచారణకు వచ్చినట్టు చెప్పారు. డాక్టర్లు, సిబ్బందిని వేర్వేరుగా ప్రశ్నించి బిల్లుల విషయంపై విచారణ చేపట్టినట్టు తెలిపారు. బిల్లులు సక్రమంగా ఉన్నదీ లేనిదీ నిర్ధారించిన అనంతరం వీటిపై నివేదిక అందిస్తామన్నారు.  హెచ్‌సీ వెంకటరావు, ఇతర సభ్యులు ఉన్నారు.  


 

 

Updated Date - 2021-04-16T04:40:54+05:30 IST