కొనసాగుతున్న కరోనా ప్రభావం

ABN , First Publish Date - 2021-01-24T04:58:38+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గ డం లేదు. ప్రతీరోజు పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా రాక ముందులాగానే జనం అవ సరాల రీత్యా బయటకు వస్తుండడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోంది. నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ప్రతీరోజు 10 నుంచి 20 కేసులు నమోదవుతున్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలోనూ ఇదే విధంగా కేసులు నమోదవుతున్నాయి.

కొనసాగుతున్న కరోనా ప్రభావం

ఉమ్మడి జిల్లాలో నిత్యం పెరుగుతున్న కొత్త కేసులు 

తప్పనిసరిగా మాస్కులు వాడాలంటున్న వైద్యులు 

నిజామాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గ డం లేదు. ప్రతీరోజు పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా రాక ముందులాగానే జనం అవ సరాల రీత్యా బయటకు వస్తుండడం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోంది. నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ప్రతీరోజు 10 నుంచి 20 కేసులు నమోదవుతున్నాయి. కామారెడ్డి జిల్లా పరిధిలోనూ ఇదే విధంగా కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 15,582 కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా పరిధిలో 13,565 కేసులు న మోదయ్యాయి. గతంతో పోలిస్తే తీ వ్రత కొంత తగ్గినా పాజిటివ్‌ కేసులు మాత్రం తగ్గు ముఖం పట్టడం లేదు. కరోనా తగ్గుతోందనే నమ్మకంతో ఎక్కువ మంది మాస్కులు వాడకపోవడం, శానిటైజర్‌లను ఉపయోగించకపోవడం వల్ల కేసులు న మోదవుతున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. ప్రతి ఒక్క రూ మాస్కులు, శానిటైజర్‌లు వాడితే కేసుల సంఖ్య తగ్గుతుంద ని వారు సూచిస్తున్నారు. 

కొనసాగుతున్న కొవిడ్‌ వ్యాక్సికేషన్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు ఉమ్మడి జిల్లా లోని మొత్తం 68 పీహెచ్‌సీల పరిధిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్ర క్రియను కొనసాగిస్తున్నారు. కోవిషీల్డ్‌నే అందిస్తున్నారు. ఉమ్మ డి జిల్లా పరిధిలో ప్రభుత్వ వైద్య సిబ్బందికి గడిచిన కొన్ని రోజులుగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ఎంపిక చేసిన వారికి టీకాలు వేస్తున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బందికి పూర్తవుతున్నందున ప్రైవేటు వైద్య సిబ్బందికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారి వివరాలను తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్య సిబ్బందిఇ పూర్తికాగానే శానిటేషన్‌, పోలీసు, రెవెన్యూ సిబ్బందికి టీకాలు వే సేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వారి వివరాలు కూడా సేకరించారు. ఇదిలా ఉండగా.. ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో ఇంకా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని నిజామాబాద్‌ జిల్లా వై ద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. కొవిడ్‌ వ్యా క్సినేషన్‌ కొనసాగుతున్నా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతీ రోజు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయన్నారు. అవసరాల నిమిత్తం బయటకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్కులు వాడాలని, శానిటైజర్‌లు ఉపయోగించాలని ఆయన తెలిపారు. 

‘కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితం.. అపోహలు నమ్మొద్దు’

పెద్దబజార్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ సురక్షితమని, అపోహలు నమ్మవద్దని రెడ్‌క్రాస్‌ నిజామాబాద్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ నీలి రాంచందర్‌ అన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం, ఆసుప త్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ చేతుల మీదుగా ఆయ న కొవిడ్‌ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ మీద ఉన్న అపోహలు, అపోహలేనని, అధైర్యపడకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఈ కార్యక్రమంలో తోట రాజశేఖర్‌, డాక్టర్‌ బాలరాజ్‌, రామకృష్ణ, బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

Updated Date - 2021-01-24T04:58:38+05:30 IST