కొనసాగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-30T05:49:55+05:30 IST

జిల్లాలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కొనసాగు తున్నాయి.

కొనసాగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు
ఓర్వకల్లులో అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులు

కర్నూలు(కల్చరల్‌), సెప్టెంబరు 29: జిల్లాలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కొనసాగు తున్నాయి.  నాలుగో రోజు గురువారం వివిధ ఆలయాల్లో అమ్మవా రికి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాల సమర్పణతోపాటు విశేష అలం కరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. స్థానిక మించిన్‌ బజార్‌లోని పెద్ద అమ్మవారి శాలలో ఉదయం విఘ్నేశ్వర పూజతో వేడుకలు ఆరంభించారు. పుణ్యావచనం, పంచగవ్యం, శ్రీచక్రార్చన, శ్రీవాసవీదేవికి ఉపనిషత్తులతో అర్చన, అభిషేకం, నూతన వస్త్రాలంకరణ, హో మం, మంగళహారతి కార్యక్రమాలు నిర్వహిం చారు. సాయంత్రం అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పూలబజార్‌లోని చిన్న అమ్మవారిశాలలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం వాసవి మాత మూలమూర్తికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. ఆలయంలోని కింది అంతస్తులో లలితాదేవి అలంకరణలో, పై అంతస్తులో హిమగిరి తనయ అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. చిత్తారి వీధిలోని నిమిషాంబ ఆలయంలో నాలుగో రోజు గురువారం ఉదయం పంచామృతాభిషేకం, పట్టు వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, శ్రీచక్రార్చన, మహామంగళ హారతి నిర్వహిం చారు. సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం, నగ, త్రిశూల, పంచా, నక్షత్ర, మూలా హారతులు ఇచ్చారు. అమ్మవారికి శ్రీమహాలక్ష్మిదేవి అలంకరణ చేశారు. వన్‌టౌన్‌ కాళికాంబ దేవాలయంలో అన్నపూర్ణాదేవి అలంకరణ చేశారు. పాతనగరంలోని గీతా మందిరంలో అమ్మవారికి మోహినీ దేవి అలం కరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక సప్తగిరి నగర్‌ (కేసీ కెనాల్‌) సమీపంలోని మణికంఠ అయ్యప్ప స్వామి దేవాలయం ఆవరణలోని చౌడేశ్వరి మాతా ఆలయంలో అమ్మవారికి మహాలక్ష్మీదేవి అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.

గూడూరు: దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుంకులాపరమేశ్వరి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం మండలంలోని కె నాగలాపురం గ్రామంలోని సుంకులాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గణపతి పూజ, హోమ కార్యక్రమాలతో పూజలు ప్రారంభమయ్యాయి. నాలుగో రోజు సుంకులాపరమేశ్వరి దేవీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో కుంకు మార్చనా, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణ దాత, చైర్మన్‌ సేతుపతి రాజ్‌ కుమార్‌, వారి సోదరుడు వెంకటేష్‌తోపాటు వారి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నానరు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది కేశవ, పురోహితులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

ఓర్వకల్లు: శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గురువారం నాల్గవ రోజు ఓర్వకలు లోని చౌడేశ్వరిదేవీ అమ్మవారి ఆల యంలో అమ్మవారికి పూజలు  నిర్వహిం చారు. అలాగే సుంకులమ్మ ఆలయంలో అమ్మవారికి, హుశేనాపురంలో దుర్గామాతాకు, నన్నూరులో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలకు పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కాయక ర్పూ రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


Updated Date - 2022-09-30T05:49:55+05:30 IST