కొనసాగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2022-06-27T04:22:10+05:30 IST

ఎగువన కురు స్తున్న వర్షాలకు మండలంలోని వట్టివాగు, కుమరం భీం ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. వట్టి వాగు ప్రాజెక్టు నీటిమట్టం 238మీటర్లకు చేరుకుంది.

కొనసాగుతున్న వరద ఉధృతి
కుమరంభీం రెండు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్న అధికారులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 26: ఎగువన కురు స్తున్న వర్షాలకు మండలంలోని వట్టివాగు, కుమరం భీం ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. వట్టి వాగు ప్రాజెక్టు నీటిమట్టం 238మీటర్లకు చేరుకుంది. 222క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ఒక గేటు ఎత్తి 361క్యూసెక్కుల వరద నీటిని బయటికి వదులుతున్నారు. అలాగే కుమరంభీం ప్రాజెక్టు ప్రస్తుతం 241.3మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టులోకి 8800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా రెండు గేట్లను ఎత్తి 5512 క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులనీటిని విడుదల చేస్తుండ డంతో సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-06-27T04:22:10+05:30 IST