శ్రీరామసాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-09-23T07:14:38+05:30 IST

శ్రీరామసాగర్‌కు వరద ఉధృతి తగ్గడం లేదు. వర్షాలు తగ్గినా ప్రాజెక్టు ల్లోకి భారీగానే వరద

శ్రీరామసాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి

నిజామాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/మెండోరా: శ్రీరామసాగర్‌కు వరద ఉధృతి తగ్గడం లేదు. వర్షాలు తగ్గినా ప్రాజెక్టు ల్లోకి భారీగానే వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో వర్షాలు పడుతుం డటంతో అక్కడి ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో తొంభై అడుగుల నీటిని ఉంచుతూనే మిగతా నీటిని దిగు వకు వదులుతున్నారు. భారీగా వరద వస్తుండడంతో ఆయకట్టు కాలు వలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు.  శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 170 టీఎంసీల వరద వచ్చి చేరింది. ప్రాజెక్టుకు ప్రస్తు తం గోదావరి, మంజీరాల ద్వారా 1,71,000 క్యూసెక్కుల వరద వస్తోంది.


ప్రాజెక్టు నుంచి 40గేట్ల ద్వారా లక్షా యాభై వేల క్యూసెక్కుల నీటి ని దిగువకు వదులుతున్నారు. వీటితో పాటు ఆయకట్టుకు నీటి విడు దల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా నీటిని మిడ్‌ మానేరుకు కొన సాగిస్తున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ 90అడుగులు కొనసాగిస్తూనే నీటిని విడుదల చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వస్తోన్న వరదను అంచనా వేస్తూ ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి గోదావరికి 70 టీఎంసీ ల నీటిని విడుదల చేశారు. వరద కాలువ ద్వారా మిడ్‌ మానేరుకు, కాకతీయ కాలువల ద్వారా మరికొంత నీటిని దిగువకు విడుదల చేశా రు. గడిచిన కొన్ని రోజులుగా గోదావరికి నీటిని విడుదల చేయడంతో మెండోరా, ఏర్గట్ల మండలాల పరిధిలో వరద పారుతోంది. గోదావరి అంతటా నీళ్లే కనిపిస్తున్నాయి. గోదావరి ఇవతలి వైౖపు జిల్లాలోని గ్రామాలు ఉండగా అవతలి వైపు నిర్మల్‌ జిల్లా సోన్‌, లక్ష్మణచాందా, మామడ మండలాల గ్రామాలు ఉన్నాయి.


ఈ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు ఎగువన త్రివేణి సంఘమం అయినా కందకుర్తి వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది. అంతర్రాష్ట్ర బ్రిడ్జిని ఆనుకునే విధంగా వరద వస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా శ్రీరామసాగర్‌కు వరద వస్తుండటంతో ప్రాజెక్టు వద్ద పర్యా టకుల సంఖ్య కూడా పెరిగింది. జాతీయ రహదారి వెంట వెళ్లేవారు కూడా ఆగి చూసి వెళుతున్నారు. కొవిడ్‌ వ్యాప్తి ఉండటం వల్ల ఎక్కువ మందిని ప్రాజెక్టుపైకి అధికారులు అనుమతించడం లేదు. మహారాష్ట్ర లో ప్రాజెక్టు గేట్లను ఎత్తడం వల్ల ఈ వరద వస్తోందని ఈఈ రామా రావు, డీఈ జగదీ్‌ష్‌లు తెలిపారు. వరద ఎక్కువగా వస్తుండడంతో నలభై గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.


నిజాంసాగర్‌లో 1393.00 అడుగుల నీటిమట్టం

నిజాంసాగర్‌: నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 1405.00 అడుగులకు 1393.00 అడుగుల నీటిమట్టం ఉందని, 17.802 టీఎంసీలకు గాను 5.542 టీఎంసీల నీటిమట్టం నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలి పారు. ఎగువ ప్రాంతం నుంచి 3,369 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందన్నారు.


సింగూరులో 521.50 మీటర్ల నీటి మట్టం

నిజాంసాగర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సింగూరు ప్రాజె క్టులో 523.600మీటర్ల గాకు 521.150 మీటర్ల నీటి మట్టం, 29.917 టీఎంసీలకు గాను 18.727 టీఎంసీల నీరు నిల్వ ఉంద ని, ఎగువ ప్రాంతం నుంచి 12,666 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టులో వచ్చి చేరుతుందన్నారు. ఎగు వ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లో క్రమంగా నీటిమ ట్టం పెరుగుతూ వస్తుందన్నారు.

Updated Date - 2020-09-23T07:14:38+05:30 IST