శ్రీరామసాగర్‌కు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2021-06-21T06:55:25+05:30 IST

శ్రీరామసాగర్‌ ప్రాజె క్టుకు వరద కొనసాగుతోంది. గోదావరి ద్వారా ప్రాజెక్టులోకి 9,259 క్యూసె క్కుల వరద వచ్చి చేరుతోంది.

శ్రీరామసాగర్‌కు కొనసాగుతున్న వరద

నిజామాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శ్రీరామసాగర్‌ ప్రాజె క్టుకు వరద కొనసాగుతోంది. గోదావరి ద్వారా ప్రాజెక్టులోకి 9,259 క్యూసె క్కుల వరద వచ్చి చేరుతోంది. మహారాష్ట్రలో వర్షాలు తగ్గడంతో బాబ్లీ ప్రా జెక్టు గేట్లను మూసివేశారు. దీంతో వరద తగ్గుముఖం పట్టింది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(90 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం 1067.60 (25 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది. ఇదిలా ఉండగా.. గడిచిన రెండు రోజుల నుంచి జిల్లాలో భారీ వర్షం కురవడం లేదు. కొన్ని గ్రామాల పరిధిలో జల్లులు పడుతుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్న మయ్యారు. విత్తనాలు, వరినాట్లను వేస్తున్నారు. జిల్లాలో ఆదివారం 4 మి. మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 111 మి. మీ. వర్షం కురవాల్సి ఉండగా.. 205 మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలోని 29 మండలాల్లో సాధారణానికి మించి వర్షం కురిసింది.

Updated Date - 2021-06-21T06:55:25+05:30 IST