కొనసాగుతున్న గణేష్‌ నవరాత్రి వేడుకలు

ABN , First Publish Date - 2021-09-18T07:58:22+05:30 IST

జిల్లా వ్యాప్తంగా గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రం భువనగిరిలో శుక్రవారం 32 మండపాల వద్ద అన్నదానం నిర్వహించారు.

కొనసాగుతున్న గణేష్‌ నవరాత్రి వేడుకలు
భువనగిరిలో సామూహిక కుంకుమార్చానలో పాల్గొన్న మహిళలు

భువనగిరిటౌన్‌, సెప్టెంబరు 17: జిల్లా వ్యాప్తంగా  గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.  జిల్లా కేంద్రం భువనగిరిలో శుక్రవారం 32 మండపాల వద్ద అన్నదానం నిర్వహించారు. దీంతో గణేష్‌ మండలపాల వద్ద రోజంతా రద్దీ  నెలకొన్నది. పలు మండపాల్లో మహిళలు సామూహిక కుంకుమార్చానలు చేశారు. ఈ కార్యక్రమాల్లో మునిసిపల్‌ చెర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, ఏసీపి సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్‌  సుధాకర్‌,  కౌన్సిలర్లు, నపాల్గొన్నారు. 

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత: వీరేశం 

 రామన్నపేట: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని   మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. రామన్నపేటలోని గణేష్‌ మండపం వద్ద ఆయన  ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  గంగుల రాజిరెడ్డి, కృష్ణ, జెల్ల వెంకటేశం, ఎండీఅక్రమ్‌, కూనూరు కృష్ణ, కొమ్ము శేఖర్‌ పాల్గొన్నారు.

అన్నిదానాల కంటే అన్నదానం మిన్నం: లక్ష్మీనర్సింహారెడ్డి

 మోత్కూరు: అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ జి.లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు.  మోత్కూరు మునిసిపాలిటీ కేంద్రంలోని అన్నెపువాడ, అంగడిబజార్‌లో ప్రతిష్ఠించిన వినాయకుని విగ్ర హాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు, మార్కెట్‌ డైరెక్టర్‌ సోమ నర్సయ్య, మునిసిపల్‌ కౌన్సిలర్‌ గుర్రం కవిత, పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, నాగరాజు, సురేష్‌, శేఖర్‌, పాల్గొన్నారు.

ఆలేరు: మునిసిపల్‌ పరిధిలోని రెండో వార్డు సాయిగూడెంలో గణేశ్‌ మండపం వద్ద  గోపు భవాని మహేందర్‌ రెడ్డి సహకారంతో  చైతన్య యూత్‌ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఆలేరు శివాలయం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమంలో ప్రతినిధులు కటకం సిద్దురాజు, లక్ష్మీపతి, శంకర్‌ నాయక్‌, శ్రీను, సతీష్‌, నవీన్‌, భరత్‌, కె రాజు పాల్గొన్నారు. 

భూదాన్‌పోచంపల్లి: రాంనగర్‌ కాలనీలోని వినాయకుడి ఉత్సవాల్లో మేకల మోహన్‌రెడ్డి, గుత్తికొండ పెంటయ్య, విజయ్‌, కొండ శివకుమార్‌, కొండ భాస్కర్‌, తంగెల్ల లింగస్వామి, పట్టణంలోని మిత్ర యూత్‌, బీసీ కాలనీ, మార్కండేయనగర్‌ కాలనీలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. 

 ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న పూజలు 

బీబీనగర్‌: మండల కేంద్రంలో హోలియదాసరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపాన్ని ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న శుక్రవారం సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం ఉజ్వల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోలియ దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర అఽధ్యక్షుడు టంటం జహంగీర్‌, శేఖర్‌, ఎంపీటీసీ  భార్గవ్‌,  పాల్గొన్నారు. 

గుండాల: మండలంలోని సీతారాంపురం, అనంతారం, సుద్దాల తదితర గ్రామాలలో శుక్రవారం వినాయకుని వద్ద అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పంచు మల్లేశం, ఎంపీటీసీ బొంగు శ్రీశైలం, నరేష్‌, శోభన్‌ తదితరులు పాల్గొన్నారు




Updated Date - 2021-09-18T07:58:22+05:30 IST