కొనసాగుతున్న ఇంటింటి సర్వే

ABN , First Publish Date - 2021-05-11T05:41:15+05:30 IST

ప్రజల ఆరోగ్యపరిస్థితి తెలుసుకునేందుకు ఆయాగ్రామాల సర్పంచులు, వైద్యసిబ్బంది ఇంటింటి సర్వేలో పాల్గొంటున్నారు.

కొనసాగుతున్న ఇంటింటి సర్వే

 గ్రామాల్లో కరోనా టెస్టులు

 లక్షణాలు ఉన్నవారికి కొవిడ్‌ కిట్ల పంపిణీ

 అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచన


చిన్నశంకరంపేట, మే 10: ప్రజల ఆరోగ్యపరిస్థితి తెలుసుకునేందుకు ఆయాగ్రామాల సర్పంచులు, వైద్యసిబ్బంది ఇంటింటి సర్వేలో పాల్గొంటున్నారు. సోమవారం మండలంలోని చందాపూర్‌, కామారం, చందంపేట, మీర్జాపల్లి, మలుపల్లి, కామారంతాండా తదితర గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు. సర్వేలో రమాదేవి, యాదగిరి యాదవ్‌, శ్రీలత, శ్రీనివా్‌సరెడ్డి, లక్ష్మి, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. కొవిడ్‌లక్షణాలు ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. 


‘చేజ్‌ ద కరోనా’ సర్వేను పరిశీలించిన వంటేరు

తూప్రాన్‌ మే 10 : తూప్రాన్‌ పట్టణ పరిధిలో నిర్వహిస్తున్న ‘చేజ్‌ ద కరోనా’ సర్వేను ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి పరిశీలించారు. సోమవారం తూప్రాన్‌ పట్టణానికి వచ్చిన వంటేరు ప్రతా్‌పరెడ్డి 5వార్డులో పర్యటించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్‌చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, తహసీల్దార్‌ శ్రీదేవి, కుమ్మరి రఘుపతి, హెల్త్‌ టీమ్‌ సభ్యులు, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు. 

తూప్రాన్‌, మనోహరాబాద్‌ మండలాల్లో ఇంటింటి సర్వే కొనసాగుతుంది. మల్కాపూర్‌లో సర్వే నిర్వహిస్తున్న సభ్యులతో కలిసి సర్పంచు మహదేవి, వార్డు సభ్యుడు ఆంజనేయులుగౌడ్‌, కార్యదర్శి మహేందర్‌రెడ్డి మందులను అందజేశారు. తూప్రాన్‌లోని ఎస్సీకాలనీలో వైద్యాధికారి డాక్టర్‌ ఆనంద్‌ సర్వేను పరిశీలించి లక్షణాలున్న వ్యక్తులకు కిట్స్‌ను అందజేశారు. తూప్రాన్‌లోని కొన్నిబృందాల్లో కేవలం అంగన్‌వాడీ, వీఆర్‌ఏలు పాల్గొంటున్నారు. 


లక్షణాలు ఉన్న వారికి మందులు పంపిణీ

నారాయణఖేడ్‌: నారాయణఖేడ్‌ మున్సిపాలిటీ పరిధిలో జ్వరపీడితులతో పాటు కరోనా లక్షణాలు ఉన్న వారి గుర్తింపు కోసం నిర్వహిస్తున్న సర్వే సోమవారం కొనసాగింది. జ్వరం, కరోనా లక్షణాలు ఉన్న వారికి వైద్య సిబ్బంది తగిన మందులను అందజేశారు. సర్వేలో మున్సిపల్‌ అధికారులు, రాజు, శ్రీనివాస్‌, పరక్యవేక్షించారు. అలాగే ఖేడ్‌ మండలం అకలాయి తండాలో సర్పంచు జాదవ్‌లక్ష్మిబాయి, వైద్యఆరోగ్యశాఖ ఆరోగ్యకార్యకర్తలు, ఆశాకార్యకర్తలు ఇంటింటికి తిరిగి  వివరాలు సేకరించారు. కరోనా లక్షణాలున్న వారికి మందులు అందజేశారు.


 కరోనా కట్టడికి పెద్దతండాలో చండీహోమం 

రేగోడు మే10: కరోనా అంతరించిపోవాలంటూ రేగోడు మండలంలోని పెద్దతండాలో భవానీమాత, సేవాలాల్‌ మహరాజ్‌ ఆలయం వద్ద సోమవారం లలితా సహస్ర చండీహోమం నిర్వహించారు. ఈ హోమాన్ని ముంగి పీఠాధిపతి దేవగిరి మహారాజ్‌ ఆధ్వర్యంలో చేశారు. కార్యక్రమంలో పెద్దతండా ఉప సర్పంచ్‌ సంగ్య నాయక్‌, రమేష్‌, లక్ష్మణ్‌ నాయక్‌ పాల్గొన్నారు. 

అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని రేగొడు ఎస్‌ఐ సత్యనారాయణ అన్నారు. సోమవారం మండలంలోని గజవాడ చౌరస్తాలో మాస్కులు లేకుండా వెళ్తున్న ప్రయాణికులకు జరిమానా చేశారు. అలాగే టిలింగంపల్లి సర్పంచ్‌ సుమంత, గ్రామకార్యదర్శి రాములు ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరం, జలుబు లక్షణాలు ఉన్న పలువురికి కిట్లను పంపిణీ చేశారు. సర్వేలో నాయకులు వినోద్‌, ఏఎన్‌ఎం రాణమ్మ, ఆశావర్కర్‌ పాలమ్మ ఉన్నారు.


సామాజిక దూరం పాటిస్తూ పనులు నిర్వహించుకోవాలి

హవేళీఘణపూర్‌: అత్యవసర పనులు ఉంటేనే బయటకు వెళ్లాలని, ప్రతిచోటా సామాజికదూరం పాటిస్తూ పనులు నిర్వహించుకోవాలని హవేళీఘణపూర్‌ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి సూచించారు. సోమవారం ఆయన మండల కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కులు ధరించకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది శేఖర్‌, మహేందర్‌, నవీన్‌ తదితరులున్నారు. అలాగే మండల పరిధిలోని బూర్గుపల్లి, హవేళీఘణపూర్‌ గ్రామాల్లో ఏఎన్‌ఎం సావిత్రి, బూలి, సర్పంచ్‌ సవిత, చెన్నాగౌడ్‌ ఇంటింటి సర్వే నిర్వహించి లక్షణాలు ఉన్న వారికి మందులను అందజేశారు. 

Updated Date - 2021-05-11T05:41:15+05:30 IST