TS News: నకిలీ సర్టిఫికెట్ల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

ABN , First Publish Date - 2022-08-11T19:57:17+05:30 IST

నకిలీ సర్టిఫికెట్ల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న వివేకానంద వర్శిటీ అధికారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

TS News: నకిలీ సర్టిఫికెట్ల కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

హైదరాబాద్: నకిలీ సర్టిఫికెట్ల కేసు (fake certificates case)లో  దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న వివేకానంద వర్శిటీ (Vivekananda Varsity) అధికారుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీవాస్తవ్,  పరీక్షల నియంత్రణ అధికారి పాండేపై కేసు నమోదు అయ్యింది. వీసీ, రిజిస్ట్రార్ పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో పదేళ్లుగా  వివేకానంద వర్సిటీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 24 నకిలీ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో సర్టిఫికెట్కు అధికారులు రూ.3 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. బీటెక్, పీజీ, డిగ్రీ సర్టిఫికెట్లను విశ్వవిద్యాలయం నుంచే జారీ అయ్యాయి. బోపాల్లోని ఎస్ఆర్కే వర్సిటీ నుంచి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్ఆర్కే వర్సిటీకి చెందిన వీసీ, మాజీ వీసీ, రిజిస్ట్రార్, డైరెక్టర్లను మూడు నెలల క్రితమే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  


నిందితుల బెయిల్ పిటిషన్ తిరస్కరణ..

మరోవైపు వివేకానంద వర్శిటీ నకిలీ సర్టిఫికెట్ల నిందితులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా... శ్రీవాస్తవ్, పాండే బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. దీంతో నకిలీ సర్టిఫికెట్ల కేసు నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. 

Updated Date - 2022-08-11T19:57:17+05:30 IST