కొనసాగుతున్న నిజాంసాగర్‌ నీటి విడుదల

ABN , First Publish Date - 2020-10-28T11:05:31+05:30 IST

నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యంతో కళకళలాడుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిజాంసాగర్‌ నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు

కొనసాగుతున్న నిజాంసాగర్‌ నీటి విడుదల

2,498 క్యూసెక్కుల వరద నీరు మంజీరాలోకి..

ఎగువ ప్రాంతాల నుంచి 2,498 క్యూసెక్కుల వరద నీరు రాక


నిజాంసాగర్‌, అక్టోబరు 27: నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యంతో కళకళలాడుతోంది. ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిజాంసాగర్‌ నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. 1, 2, 3 విడతలుగా నిజాంసాగర్‌ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన నిజాంసాగర్‌ నీటి విడుదలను నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 2,498 క్యూసెక్కుల వరద నీరు వస్తుం డటంతో మంగళవారం వీఏఆర్‌ నెంబర్‌ 5లోని వరద గేటును ఎత్తి అంతే మొత్తం 2,498 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో 1405 అడుగుల పూర్తినీటి సామర్థ్యం కలిగి ఉంది. బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సింగూరులో 1400 క్యూసెక్కుల వరద నీటిని నిజాంసాగర్‌లోకి విడుదల చేస్తున్నారు. 523.600 మీట ర్లకు గాను 523.600 మీటర్ల నీటి సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 29.917 టీఎంసీల నీరు నిల్వ ఉందని నీటి పారుదల శాఖాధికారులు తెలిపారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి మూడు విడతలుగా నీటిని విడుదల చేస్తుండటంతో ఇప్పటి వరకు 29 టీఎంసీల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-10-28T11:05:31+05:30 IST