క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి

ABN , First Publish Date - 2022-05-28T05:07:34+05:30 IST

క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఆటల్లో రాణించాలని సీనియర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు, రిటైర్ట్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌, పాలమూరు విశ్వవిద్యాలయం పీడీ బాలరాజ్‌ గౌడ్‌ అన్నారు.

క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న పీయూ ఫిజికల్‌ డైరెక్టర్‌ బాలరాజ్‌ గౌడ్‌

- పీయూ ఫిజికల్‌ డైరెక్టర్‌ బాలరాజ్‌ గౌడ్‌ 

గద్వాల అర్బన్‌, మే 27 : క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఆటల్లో రాణించాలని సీనియర్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు, రిటైర్ట్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌, పాలమూరు విశ్వవిద్యాలయం పీడీ బాలరాజ్‌ గౌడ్‌ అన్నారు. పట్టణంలోని సోమనాద్రి ఫుట్‌బాల్‌ స్టేడియంలో కొనసాగుతున్న సౌత్‌ ఇండియా ఇన్విటేషన్‌ లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పోటీలకు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దివంగత క్రీడాకారుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ప్రవీణ్‌ సేవా సమితి, గద్వాల ఫుట్‌బాల్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో దక్షిణ భారత స్థాయిలో టోర్నమెంట్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారుల స్ఫూర్తితో నేటితరం యువకులు రాణిం చాలని ఆకాంక్షించారు. క్రీడాకారుడిగా ఉద్యోగాన్ని ద క్కించుకుని, అదే స్పూర్తితో తాను పనిచేస్తున్న విద్యు త్‌ శాఖలో ఫుట్‌బాల్‌ టీంను తయారు చేసిన  ఘనత సంజీవయ్య సొంతమన్నారు.  


రెండవ రోజు పోటీలు ఇలా..

గద్వాల ఎఫ్‌సీ, సఫా జట్ల మధ్య శుక్రవారం ఉదయం జరిగిన పోటీలో నిర్ణీత సమయానికి ఏ జట్టు కూడా గోల్‌ సాధించక పోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. గ్లోబుల్‌ హైదరాబాద్‌, పవన్‌ హుబ్లీ జట్ల మధ్య జరిగిన రెండవ మ్యాచ్‌లో హుబ్లీపై  గ్లోబుల్‌ టీం నాలుగు గోల్స్‌ సాధించింది. నోబుల్‌ ఎఫ్‌సీ నాందేడ్‌, ఆర్‌ఆర్‌ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన పోరులో ఆర్‌ఎస్‌ ఎఫ్‌సీ ఒక గోల్‌ సాధించగా, నాందేడ్‌ టీం రెండు గోల్స్‌ సాధించి గెలుపొందింది. ఫలక్‌నామా, తమిళనాడు జట్ల మధ్య జరిగిన పోటీల్లో తమిళనాడు జట్టు రెండు గోల్స్‌తో విజయం సాధించింది. మధ్యాహ్నం సఫా, కడియం జట్ల మధ్య పోటీ జరుగగా, రెండు జట్లు కూడా గోల్స్‌ సాధించకపోవడంతో డ్రాగా ముగిసింది. అనంతరం బీవిన్‌ ఎఫ్‌సీ, పవన్‌ హుబ్లీ జట్ల మధ్య పోటీ జరుగగా, బీవిన్‌ జట్టు మూడు గోల్స్‌  సాధించింది. చివరగా ఆర్‌ఆర్‌ ఎఫ్‌సీ, గుంటూరు జట్ల మధ్య పోటీ జరుగగా నిర్ణీత సమయంలో రెండు జట్లు 1-1 గోల్స్‌ సాధించడంతో డ్రాగా ముగిసింది. ఆర్యవైశ్య అఫీషియల్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ అసోసియేషన్‌ (అవోపా) ఆధ్వర్యంలో ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు మిన రల్‌వాటర్‌ అందిస్తున్నట్లు గద్వాల ఫుట్‌బాల్‌ అసోసి యేషన్‌, ప్రవీణ్‌ సేవాసమితి అధ్యక్షుడు బండల వెంకట్రాములు, ఇండికా శివ తెలిపారు. అవోపా జిల్లా అధ్యక్షుడు మరిడి శ్రీకాంత్‌, పట్టణ అధ్యక్షుడు పోలిశెట్టి వీరబాబులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-05-28T05:07:34+05:30 IST