కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

ABN , First Publish Date - 2021-02-26T04:22:30+05:30 IST

మునిసిపాలి టీ పరిధిలోని 17వ వార్డులో పుర వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌ ఆధ్వ ర్యంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం కొనసాగింది.

కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు
టీఆర్‌ఎస్‌ సభ్యత్వాన్ని అందిస్తున్న పుర వైస్‌ చైర్మన్‌

నారాయణపేట/ మక్తల్‌/ ఊట్కూర్‌/ కోస్గి, ఫిబ్రవరి 25 : మునిసిపాలి టీ పరిధిలోని 17వ వార్డులో పుర వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌ ఆధ్వ ర్యంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం కొనసాగింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలను అన్నివిధాలా ఆదుకుంటుందని, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి కృషితో పట్టణంలో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కృషితోనే పార్టీలో పలువురు చేరి సభ్యత్వం తీసుకుంటు న్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సరాఫ్‌ నాగరాజు, బస య్య స్వామి, అనిల్‌, రామకృష్ణ, రియాజ్‌, దేవేందర్‌, శరణప్ప పాల్గొన్నారు.

మక్తల్‌ మునిసిపాలిటీ పరిధిలోని కొత్తగార్లపల్లి 8వ వార్డులో గురువారం టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కావలి ఆంజనేయులు, గవినోళ్ల నర్సింహారెడ్డి, బాలప్ప, ఆశప్ప, అశోక్‌, సంతోష్‌, ఉమేష్‌, క్రిష్ణ, నర్సింహ, హన్మంతు పాల్గొన్నారు. 

ఊట్కూర్‌లో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, సర్పంచ్‌ సూర్యప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యం లో సభ్యత్వం చేయించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు బాల్‌రెడ్డి, నాయకులు ఇబాదుర్‌ రహెమాన్‌, మెహన్‌రెడ్డి, సమీవుల్లా  పాల్గొన్నారు.

కోస్గి పట్టణంలోని పలు వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రాజేష్‌, మునిసిపల్‌ వైస్‌ చెర్‌పర్సన్‌ అన్నపూర్ణ, కౌన్సిలర్లు బాలేష్‌, మాస్టర్‌ శ్రీను, కోఆప్షన్‌ సభ్యుడు ఓంప్రకాష్‌ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వం చేయిం చారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కూడా పార్టీ నాయకులు సభ్యత్వాలను చేయించారు. 

Updated Date - 2021-02-26T04:22:30+05:30 IST