కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌డౌన

ABN , First Publish Date - 2021-05-09T04:51:48+05:30 IST

జిల్లా కేంద్రం భువనగిరిలో స్వచ్ఛంద లాక్‌డౌన కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకే దుకాణాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలను పూర్తిచేస్తున్నారు.

కొనసాగుతున్న స్వచ్ఛంద లాక్‌డౌన
భువనగిరిలో మూసి ఉన్న దుకాణాలు

దుకాణాల మూసివేత ఫ రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్న ప్రజలు

జనసంచారం లేక బోసిపోతున్న వీధులు

భువనగిరి టౌన, మే 8: జిల్లా కేంద్రం భువనగిరిలో స్వచ్ఛంద లాక్‌డౌన కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకే దుకాణాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలను పూర్తిచేస్తున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు రహదారులన్నీ బోసిపోతున్నాయి. అయితే తెరిచి ఉన్న కొన్ని దుకాణాల యజమానులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మూసివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే మీ వ్యాపారాలు ముఖ్యం కావని, తెరిచి ఉన్న దుకాణాల్లోకి వెళ్లి వాదిస్తున్నారు. మునిసిపల్‌ చైర్మన ఎనబోయిన ఆంజనేయులుతోపాటు పలువురు స్వచ్ఛందంగా లాక్‌డౌనను పర్యవేక్షించారు. రంజాన అనంతరం స్వచ్ఛంద లాక్‌డౌనలో అందరం భాగస్వాములవుతామని కొద్దిమంది వ్యాపారులు పేర్కొంటున్నారు. 



మోత్కూరులో ఒక్కపూట దుకాణాలు

మోత్కూరు: మోత్కూరు మండలంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున మునిసిపాలిటీ కేంద్రంలో ఆదివారం నుంచి ఈ నెల 23 వరకు 15 రోజులు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని కిరాణ అసోసియేషన నిర్ణయించింది. అసోసియేషన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గౌరు సత్యనారాయణ, గుర్రం మోహనరెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంటాయని, ఆ తర్వాత ఎవరైనా దుకాణాలు తెరిచి ఉంచితే రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. వ్యాపారులు, ప్రజలు సహకరించాలని వారు కోరారు.


కొవిడ్‌ను స్వీయ రక్షణతోనే తరిమి కొట్టాలి

చౌటుప్పల్‌ టౌన: కొవిడ్‌ను స్వీయ రక్షణతోనే తరిమి కొట్టాలని చౌటుప్పల్‌ మునిసిపల్‌ చైర్మన వెనరెడ్డి రాజు అన్నారు. స్థానిక మునిసిపల్‌ కార్మికులకు భారత సేవా సహకార ఫోరం ఆధ్వర్యంలో సమకూర్చిన మాస్క్‌లను చైర్మన రాజు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు బి.శ్రీనివాస్‌, బొబ్బిళ్ల మురళీ, శానిటరీ అధికారి రేణుకుమార్‌ లు పాల్గొన్నారు.


రెండోరోజు దుకాణాల మూసివేత విజయవంతం

కరోనా ఉధృతిని నియంత్రించడంలో భాగంగా చౌటుప్పల్‌ పట్టణంలోని దుకాణాల మూసివేత రెండో రోజు విజయవంతమైంది. అత్యవసర సేవలైన ఆసుపత్రులు, మెడికల్‌ షాపులు పనిచేశాయి. వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే కొనసాగింది. చౌటుప్పల్‌ పట్టణంలోని కమ్యూనిటీ హె ల్త్‌ సెంటర్‌ వద్ద కొవిడ్‌ పరీక్షదారుల కోసం మునిసిపల్‌ చైర్మన ప్రత్యేకమైన చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 


ఆరోగ్యం కాపాడుకునే బాధ్యత ప్రజల చేతిలోనే ఉంది 

రామన్నపేట: ఆరోగ్యాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజల చేతిలోనే ఉందని సర్పంచలు, ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, గుత్త నర్సిరెడ్డి, ఎడ్ల మహేందర్‌రెడ్డి, గోదాసు శిరీషపృథ్వీరాజ్‌లు అన్నారు. రామన్నపేట, వెల్లంకి, సిరిపురం, కుంకుడుపాముల, పల్లివాడ తదితర గ్రామాల్లో వ్యాపారులు, అఖిలపక్ష నాయకులు సమావేశమై ఈ నెల 1వ తేదీ నుంచి చివరి తేదీ వరకు పాక్షికబంద్‌ చేయాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. రామన్నపేట ఏరియా ఆసుపత్రి, మునిపంపుల ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినల కొరత తీవ్రంగా ఉండడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రామన్నపేట, వలిగొండ, చిట్యాల మండలాలకు చెందిన వందలాది మంది ప్రజలు రామన్నపేట ప్రభుత్వాసుపత్రికి వస్తున్నారు. వ్యాక్సిన లేకపోవడంతో, వీరు వెనుతిరిగి వెళ్తున్నారు. ఇప్పటికి మొదటి డోస్‌ తీసుకున్న వారు రెండో డోస్‌ వేయించుకోవడానికి సమయం దాటిపోతుండడంతో, అనేక మంది ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వైద్యాధికారి రవికుమార్‌ను వివరణ కోరగా, పైలెట్‌ ప్రాజెక్టు కింద మొదటి విడత 1000 మందికి వ్యాక్సిన వేసినట్లు, రెండో విడత వ్యాక్సినేషనల కొరత ఏర్పడడంతో, ఆసుపత్రికి వచ్చిన ప్రజలు వెనుతిరిగి పోతున్నారని తెలిపారు.  


వలిగొండ: కరోనా వైరస్‌ కట్టడి కోసం వలిగొండ పట్టణంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం, వ్యాపారులు తీసుకున్న సెల్ఫ్‌లాక్‌డౌన విజయవంతమయింది. నిర్ణీత సమయం 2.30గంటలకు వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. జనసంచారం లేక రోడ్లన్నీ బోసిపోయాయి. అత్యవసర సేవలు, మెడికల్‌ షాపులు తెరిచే ఉన్నాయి. భువనగిరి-చిట్యాల మార్గం వైపువెళ్లే ఆర్టీసీ బస్సులు యథావిధిగా తిరిగాయి. గ్రామాల నుంచి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. స్వచ్ఛంద లాక్‌డౌన విధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-09T04:51:48+05:30 IST