మార్కెట్ ను ముంచెత్తుతున్న ఉల్లి...తగ్గిన ధరలు

ABN , First Publish Date - 2021-11-04T21:27:06+05:30 IST

గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉల్లి ధరలు బాగా తగ్గాయి.

మార్కెట్ ను ముంచెత్తుతున్న ఉల్లి...తగ్గిన ధరలు

హైదరాబాద్: గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఉల్లి ధరలు బాగా తగ్గాయి. హైదరాబాద్ లోని రిటైల్ మార్కెట్ లో ఉల్లిగడ్డ కిలో 20 నుంచి 25 రూపాయలు పలుకుతోంది. గత సంవత్సరం ధరలుపెరగడం వల్ల ప్రజల్లో వచ్చిన డిమాండ్ మేరకు ప్రభుత్వం ఉల్లి ధరలు తగ్గించేందుకు చేపట్టిన చర్యలు కొలిక్కి వస్తున్నాయి. ప్రస్తెుతం దేశంలో ఉల్లి ఉత్పత్తి బాగా పెరిగింది. ప్రత్యేకించి మహారాష్ట్ర, రాజస్థాన్, కర్నాటక రాష్ట్రాల నుంచి తెలంగాణకు దిగుమతులు బాగా పెరిగాయి. అలాగే రాష్ట్రంలోనూ ఉల్లి పంట ఈ సంవత్సరం బాగానే వచ్చిందని వ్యాపారులు తెలిపారు. దీంతో హైదరాబాద్ లోని ప్రధాన హోల్ సేల్ మార్కెట్లలో ఉల్లి ధరలు బాగా తగ్గాయి.


ప్రస్త్తుతం హోల్ సేల్ మార్కెట్ లో క్వింటాల్ ఉల్లి ధర 1600 నుంచి 2500 రూపాయల వరకు పలుకుతోంది. ఇక రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లిగడ్డ ధర 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు అమ్ముతున్నారు. మహారాష్ట్ర నుంచి రోజుకు 180 నుంచి 200 లారీల ఉల్లిగడ్డ హైదరాబాద్ మార్కెట్ కు దిగుమతి అవుతున్నట్టు వ్యాపారులు తెలిపారు.అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దమొత్తంలో ఉల్లిగడ్డ నగర మార్కెట్ ను ముంచెత్తుతోంది.

Updated Date - 2021-11-04T21:27:06+05:30 IST