ఉల్లికాడల సూప్‌

ABN , First Publish Date - 2021-08-05T19:06:31+05:30 IST

ఉల్లికాడలు- ఓ కట్ట, ఆలుగడ్డ ముక్కలు- కప్పు, వెల్లుల్లి ముక్కలు- స్పూను, సోయా సాస్‌- స్పూను, ఆరేగానో- పావు స్పూను, ఆలివ్‌ నూనె- రెండు స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, నీళ్లు- మూడు కప్పులు.

ఉల్లికాడల సూప్‌

కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు- ఓ కట్ట, ఆలుగడ్డ ముక్కలు- కప్పు, వెల్లుల్లి ముక్కలు- స్పూను, సోయా సాస్‌- స్పూను, ఆరేగానో- పావు స్పూను, ఆలివ్‌ నూనె- రెండు స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి - తగినంత, నీళ్లు- మూడు కప్పులు.


తయారుచేసే విధానం: ఓ కడాయిలో నూనె వేసి వెల్లుల్లి వేయించాలి. ఉల్లికాడల తరుగు కూడా వేసి తక్కువ మంటపై అయిదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి కూడా వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూతపెట్టాలి. కాస్త చిక్కబడ్డాక ఆలుముక్కల్ని బ్లెండర్‌తో మెత్తగా చేయాలి. సోయా సాస్‌, ఆరేగానో వేసి ఓ అయిదు నిమిషాలు ఉడికిస్తే ఉల్లికాడల సూప్‌ రెడీ.

Updated Date - 2021-08-05T19:06:31+05:30 IST