ఉల్లిపాయ సూప్

ABN , First Publish Date - 2021-12-04T19:27:07+05:30 IST

ఉల్లిపాయలు - పది, వెల్లుల్లి రెబ్బలు - మూడు, అల్లం - చిన్నముక్క, నల్లమిరియాలు - ఆరు, ఉప్పు - తగినంత, నెయ్యి - రెండు టీస్పూన్లు, నిమ్మరసం - పావు టీస్పూన్‌.

ఉల్లిపాయ సూప్

కావలసినవి: ఉల్లిపాయలు - పది, వెల్లుల్లి రెబ్బలు - మూడు, అల్లం - చిన్నముక్క, నల్లమిరియాలు - ఆరు, ఉప్పు - తగినంత, నెయ్యి - రెండు టీస్పూన్లు, నిమ్మరసం - పావు టీస్పూన్‌.


తయారీ విధానం: ఉల్లిపాయల పొట్టు తీసి శుభ్రంగా కడగాలి. ఒక ఉల్లిపాయను పక్కన పెట్టి మిగిలిన తొమ్మిది ఉల్లిపాయలను సన్నగా తరగాలి.  వెల్లుల్లి రెబ్బలను దంచుకోవాలి. ఒక మందపాటి పాన్‌లో నాలుగు కప్పుల నీళ్లు పోసి తరిగిన ఉల్లిపాయలు వేసి ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. తరువాత స్టవ్‌పై నుంచి దింపుకొని చల్లారబెట్టుకోవాలి. సూప్‌ చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసుకోవాలి. తరువాత జాలీ సహాయంతో వడగట్టుకోవాలి. ఇప్పుడు చిన్నమంటపై మరో పావుగంటపాటు మరిగించాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకుని దింపుకోవాలి. స్టవ్‌పై మరో పాన్‌ పెట్టి నెయ్యి వేసి ఉల్లిపాయలను వేగించాలి. ఈ ఉల్లిపాయలతో సూప్‌ను గార్నిష్‌ చేసుకోవాలి. నిమ్మరసం పిండుకుని వేడి వేడి సూప్‌ను సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-12-04T19:27:07+05:30 IST