Sabarimala:శబరిమల దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్‌కు భక్తుల ఆదరణ

ABN , First Publish Date - 2021-10-12T14:27:13+05:30 IST

అయ్యప్ప భక్తులకు శుభవార్త...కేరళలోని ప్రసిద్ధ శబరిమల పుణ్యక్షేత్రంలో మకరజ్యోతి దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైంది...

Sabarimala:శబరిమల దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్‌కు భక్తుల ఆదరణ

శబరిమల (కేరళ):కేరళలోని ప్రసిద్ధ శబరిమల పుణ్యక్షేత్రంలో మకరజ్యోతి దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ కు అయ్యప్ప భక్తుల నుంచి విశేష ఆదరణ లభించింది.  కేరళ రాష్ట్రంలో కొవిడ్ తగ్గుముఖం పట్టాక నవంబరు 16వతేదీ నుంచి అయ్యప్పదేవాలయంలో భక్తుల దర్శనానికి అనుమతిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిర్ణయం తీసుకోవడంతో ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ ప్రారంభించారు.శబరిమల దర్శనం కోసం అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో ఆన్ లైన్ బుకింగ్ చేసుకున్నారు. రోజుకు 25వేల మంది భక్తులనే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించడంతో పలువురికి దర్శనానికి ఆన్ లైన్ టికెట్లు లభించలేదు. శబరిమల అధికారిక వెబ్‌సైట్‌లో భక్తుల వివరాలు, ఛాయాచిత్రాలు అప్‌లోడ్ చేసి బుకింగ్ చేసుకోవచ్చు. 


రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు ఉన్న వారిని మాత్రమే పుణ్యక్షేత్రంలోకి ప్రవేశానికి అనుమతించాలని నిర్ణయించారు.ఆలయంలో వర్చువల్ క్యూ వ్యవస్థతోపాటు కొవిడ్ మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించారు.భక్తుల వాహనాలను నీలక్కల్ వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడ నుంచి భక్తులు స్నానం చేసేందుకు పంపా నదికి కేఎస్ఆర్టీసీ బస్సులను ఉపయోగించాలని కేరళ సర్కారు ఆదేశించింది.


Updated Date - 2021-10-12T14:27:13+05:30 IST