ఆన్‌లైన్‌ క్లాసులు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-10-22T06:48:28+05:30 IST

విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులను పకడ్బం దీగా నిర్వహించాలని డీఈవో దుర్గాప్రసాద్‌ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్‌ బా లికల పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు.

ఆన్‌లైన్‌ క్లాసులు పకడ్బందీగా నిర్వహించాలి

మోర్తాడ్‌, అక్టోబరు21: విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులను పకడ్బం దీగా నిర్వహించాలని డీఈవో దుర్గాప్రసాద్‌ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆన్‌లైన్‌ డిజిటల్‌ తరగతుల వివరాలను  ఉపాధ్యాయులు, పిల్లలకు ఇస్తున్న వర్క్‌షిట్‌ వివరాలను, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, రోజువారీ డైరీలను పరిశీలించారు. విద్యార్థుల స్పందన గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను లింక్‌ తయారు చేసుకొని వారితో మాట్లాడాలని ఉపాధ్యాయులతో అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్ధుల ఇంటికి వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎన్‌.ఆంధ్రయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-22T06:48:28+05:30 IST