ఆన్‌లైన్‌ క్లాసులంటూ అక్రమ వసూళ్లు

ABN , First Publish Date - 2020-07-06T10:41:03+05:30 IST

ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో కార్పొరేట్‌ పాఠశాలలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయని పేరెంట్స్‌ కమిటీ..

ఆన్‌లైన్‌ క్లాసులంటూ అక్రమ వసూళ్లు

 పేరెంట్స్‌ కమిటీ 


నెల్లూరు(వైద్యం), జూలై 5 : ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో కార్పొరేట్‌ పాఠశాలలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయని పేరెంట్స్‌ కమిటీ నాయకులు ఆరోపించారు. నెల్లూరులోని ఆదిత్య కళాశాలలో ఆదివారం ఆ కమిటీ సమావేశం జరిగింది. డాక్టర్‌ ఎంవీ రమణయ్య, డాక్టర్‌ రవిశంకర్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌ విద్యా సంస్థల తీరుతో అనేక మంది తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించరాదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా నిబంధనలు అతిక్రమించి తరగతులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శిఖరం నరహరి, చందు వర్మ, రమేష్‌, కిషోర్‌, బాబుల్‌ రెడ్డి, ఆదిత్యసాయి, బసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-06T10:41:03+05:30 IST