ఆన్‌లైన్‌ తరగతులపై ఓయూ ప్రకటన

Published: Sun, 16 Jan 2022 14:53:25 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఆన్‌లైన్‌ తరగతులపై ఓయూ ప్రకటన

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రేపటినుంచి ఈ నెల 30వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో యూనివర్సిటీల పరిధిలో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించడంతో పరీక్షలు రీషెడ్యూల్ విడుదల చేశారు. ఎల్లుండి నుంచి పలు యూనివర్సిటీలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా వేశారు.


మరోవైపు కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించినట్లు వెల్లడించింది. అధికారికంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు నేటితో ముగియనున్నాయి. ఈ నెల 8 నుంచి నేటి వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.