ఆన్‌లైన్‌ క్లాసులు సక్రమంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-09-25T06:49:51+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిరంతర విద్యా బోధన కొనసాగు తుందని డీఈవో దుర్గాప్రసాద్‌ వెల్ల డించారు. కోటగిరి గురువారం ఆయన పలు విద్యార్థుల ఇంటికి వెళ్లి ఆన్‌లైన్‌ తరగతులను పరిశీలించారు

ఆన్‌లైన్‌ క్లాసులు సక్రమంగా నిర్వహించాలి

కోటగిరి/ రుద్రూరు, సెప్టెంబరు 24 :  జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిరంతర విద్యా బోధన కొనసాగు తుందని డీఈవో దుర్గాప్రసాద్‌ వెల్ల డించారు. కోటగిరి గురువారం ఆయన పలు విద్యార్థుల ఇంటికి వెళ్లి ఆన్‌లైన్‌ తరగతులను పరిశీలించారు. ఆన్‌లైన్‌ విధానంలో పాఠాలు అర్థమవుతున్నాయని విద్యార్థులను అడి గి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో లేని సమయంలో యూ ట్యూబ్‌ ద్వారా పాఠ్యాంశాలను మ రోసారి వినే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడుతూ వర్క్‌షీట్స్‌ పరిశీలించడంతోపాటు ఏవైనా సందేహాలు ఉంటే ఉపాధ్యా యులు పరిష్కరిస్తున్నారని తెలిపారు. రుద్రూరు కేజీబీవీని గురువా రం తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్లాసులపై అడిగి ఆరా తీశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపట్టిక, రికా ర్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో నాగ్‌నాథ్‌, ఉపాధ్యా యులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T06:49:51+05:30 IST