మహానగరంలో గణేశ్ ఉత్సవాలకు కొత్త గైడ్‌లైన్స్

ABN , First Publish Date - 2021-09-08T15:41:00+05:30 IST

మహారాష్ట్రలో ప్రతీఏటా గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు.

మహానగరంలో గణేశ్ ఉత్సవాలకు కొత్త గైడ్‌లైన్స్

ముంబై: మహారాష్ట్రలో ప్రతీఏటా గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే కరోనా వైరస్ కారణంగా గణేశ్ ఉత్సవాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రాబోయే గణేశ్ ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక గైడ్‌లైన్స్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా గణేశ్ ఉత్సవాలలో అప్రమత్తంగా మెలగాలని సూచించింది.


మండపాలకు గణేశ్ విగ్రహాలను తీసుకువచ్చేటప్పుడు 10 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించింది. అలాగే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు మాత్రమే మండపంలో పూజాదికాల కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్దేశించింది. ఇళ్లలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించుకునేవారు విగ్రహం తీసుకువచ్చేటప్పుడు ఐదుగురు మాత్రమే ఉండాలని తెలిపింది. గణపతి మండపాల నిర్వాహకులు భక్తులను ఆహ్వానించకూడదని, వారికి ఆన్‌లైన్‌లో గణపతి దర్శనం అయ్యేలా చూడాలని సూచించింది. అలాగే గణపతి నిమజ్జన కార్యక్రమంలో ఆ మండపానికి సంబంధించిన పదిమంది మాత్రమే హాజరు కావాలని ఆదేశించింది.

Updated Date - 2021-09-08T15:41:00+05:30 IST