ఆన్‌లైనా.. ప్రత్యక్ష బోధనా?

ABN , First Publish Date - 2022-01-29T04:59:29+05:30 IST

నిర్మల్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ బోధన కొనసాగుతోంది. కొవిడ్‌ మహ మ్మారి మూడో దశ విస్తరిస్తున్నందున ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ఈ నెల 8 నుంచి 16 వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆన్‌లైనా.. ప్రత్యక్ష బోధనా?
పర్యవేక్షిస్తున్న ఉపాధ్యాయులు



ఇంకా నిర్ణయిం తీసుకోని ప్రభుత్వం
జిల్లాలో ఇప్పటికే 60 శాతం సిలబస్‌ పూర్తి  
 ప్రత్యక్ష బోధన వైపు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మొగ్గు

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 28 :
నిర్మల్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ బోధన కొనసాగుతోంది. కొవిడ్‌ మహ మ్మారి మూడో దశ విస్తరిస్తున్నందున ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ఈ నెల 8 నుంచి 16 వరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సెల వులను ఈ నెల 30 వరకు పెంచింది. విద్యార్థులు నష్టపోకుం డా ఉండేందుకు ఈ నెల 24 నుంచి ఆన్‌లైన్‌ బోధన టి సాట్‌ ఛానల్‌ ద్వారా ప్రారంభించింది. ఇప్పటికే పాఠశాలల్లో 60 శా తం సిలబస్‌ పూర్తయింది. దీనితో ఆన్‌లైన్‌ తరగతుల పట్ల అ టు తల్లిదండ్రులు గానీ ఇటు విద్యార్థులు గానీ పట్టించు కో వడం లేదు. అయితే పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆన్‌లైన్‌ బోధన కొన సాగుతుందా? లేక ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతా యా? అన్న ఆలోచన మొదలైంది. సెలవులు పొడిగించే అవకా శాలున్నాయన్న సమాచారంతో విద్యార్థుల్లో అయోమయ స్థితి నెలకొంది. పాఠశాలలు ప్రారంభించినా ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతాయన్న ప్రభుత్వ ఆలోచనతో హాజరు విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకే నిర్ణయం వది లేయనుంది.
138 పాఠశాలలు
జిల్లాలో 138 పాఠశాల లుండగా 16,410 మంది విద్యార్థులున్నారు. ఆన్‌ లైన్‌ తరగతులు ప్రా రంభం కావడంతో గ్రా మీణ ప్రాంత విద్యార్థు లు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. సిగ్నల్‌ స మస్యలు తలెత్తుతున్నాయి. 8 నుండి 10 విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు టి-సాట్‌ ప్రసారాలు చేస్తున్నాయి. విద్యార్థులు టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్‌, మొబైల్‌ ఫోన్లను ఉపయోగిస్తూ ఆన్‌లైన్‌ తరగతులు వీక్షిస్తున్నారు. పాఠాలు వింటున్నారు. అనధికారికంగా 40 శాతం వరకే విద్యార్థులు హాజరవు తున్నారని అంటున్నారు.
60 శాతానికి పైగా హాజరు..
ఆన్‌లైన్‌ తరగతులకు జిల్లాలో 60 శాతం పైగా విద్యార్థులు హాజరవు తు న్నట్లు విద్యాశాఖ వెల్లడిస్తోంది. టీవీ ప్ర సారాల్లో 7,384 విద్యార్థులు వింటుండ గా 820 మంది కంప్యూటర్ల ద్వారాను ఇతరత్రా 435 విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారని తెలిపారు. 30 వరకు సెలవులు ఉండగా క్రమేపీ విద్యార్థుల హాజరు సంఖ్య పెరుగుతోంది.
ప్రత్యక్ష తరగతులవైపే మొగ్గు..
ఆన్‌లైన్‌ తరగతుల బదులు బడులు తెరిచి ప్రత్యక్ష బోధన వైపే విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు, ఉపాధ్యాయ సం ఘాలు మొగ్గు చూపుతున్నాయి. మరోసారి విద్యాశాఖ ఉన్నతా ధికారులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నందున దశల వారీగా ప్రారంభించవచ్చునని అంటున్నారు.
పర్యవేక్షిస్తున్న ఉపాధ్యాయులు..
ఇదిలా ఉండగా ఆన్‌లైన్‌ తరగతులను ఉపాధ్యా యు లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం 50 శాతం సిబ్బందితో హాజరు కావాలని ఆదేశించడంతో రోజు విడిచి రోజు ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లి విద్యార్థుల హాజరు పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక లోపాలు ఎదురైతే పరిష్కరించే యత్నం చేస్తున్నారు. పిల్లలు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యేలా చూడాలని తల్లిదండ్రులకు వివరిస్తున్నారు.
రోజువారీ నివేదికలు పంపుతున్నాం..
- రవీందర్‌ రెడ్డి, డీఈవో

ఆన్‌లైన్‌ తరగతు లను పర్యవేక్షిస్తూ రాష్ర్టా నికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తున్నాం. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు 50 శాతం రొటే షన్‌ పద్ధతిలో హాజరు కావాలని ఆ దేశించాం. సౌకర్యం లేని విద్యార్థులను జతకలిపి పాఠాలు వీక్షించేలా ఏర్పాట్లు చేశాం. ఎంఈవోలు, కాంప్లెక్స్‌ ఉపాధ్యాయులు, సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఆన్‌లైన్‌ పాఠాలు వీక్షించేలా తల్లిదండ్రులను కనిపెట్టాలని సూచించాం. గ్రామ విద్యారిజిష్టర్‌ తయారు చేయాలని ఆదేశించాం.        

Updated Date - 2022-01-29T04:59:29+05:30 IST