ఆన్‌లైన్ మోసాలకు మరో రెండు ఉదాహరణలు.. అప్రమత్తం కాకుంటే మోససోవడం ఖాయం..

ABN , First Publish Date - 2021-11-04T17:35:05+05:30 IST

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు మరింతగా..

ఆన్‌లైన్ మోసాలకు మరో రెండు ఉదాహరణలు.. అప్రమత్తం కాకుంటే మోససోవడం ఖాయం..

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ మోసాలు మరింతగా పెరిగిపోయాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని కవార్ధాకు చెందిన ఒక ఉపాధ్యాయునితో సహా మరో ఇద్దరు ఆన్‌లైన్ మోసానికి గురయ్యారు. మొదట ఆ మోసగాళ్లు ఉపాధ్యాయునికి ఫోన్‌చేసి క్రెడిట్ కార్డుపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ ఉపాధ్యాయుడు తనకు ఆఫర్లు వద్దని చెప్పడంతో... క్రెడిట్ కార్డు రద్దయిపోతుందని ఆ మోసగాళ్లు చెప్పారు. ఈ సమయంలో సదరు ఉపాధ్యాయుడు క్రెడిట్ కార్డు నంబర్ వారికి చెప్పాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ ఉపాధ్యాయుని బ్యాంకు ఖాతాలోని లక్ష రూపాయలు మాయమయ్యాయి. 


అదేవిధంగా ఆన్‌లైన్ షాపింగ్‌లో రూ.600ల విలువైన్ షర్టు కొనుగోలు చేసిన వ్యక్తికి రూ.46 వేల రూపాయల మేరకు మోసం జరిగింది. వివరాల్లోకి వెళితే సహస్పూర్ లోహరా పోలీస్ స్టేషన్ పరిధిలోని వార్డ్ నిర్మల్ సింగ్.. మెరవి జామ్‌గావ్ గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. అతని మొబైల్‌కు క్రెడిట్ కార్డ్‌పై ఆఫర్ గురించి తెలియజేస్తూ ఫోను వచ్చింది. అయితే నిర్మల్ సింగ్ తనకు ఆఫర్ వద్దని చెప్పడంతో కార్డు బ్లాక్ అవుతుందని వారు చెప్పారు. కార్డును కొనసాగించేందుకు దాని నంబర్ చెప్పాలని వారు కోరారు. దీంతో నిర్మల్ వారికి క్రెడిట్ కార్డు నంబర్ చెప్పాడు. కొద్దిసేపటికే అతని మొబైల్‌కి లక్షా నాలుగు వేల రూపాయలు డ్రా చేసినట్లు మెసేజ్ వచ్చింది. రెండో కేసు విషయాని కొస్తే మఠ్‌పారా నివాసి ఝంకర్ కుమార్ రాజే ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ద్వారా రూ.600 విలువైన షర్ట్‌ను ఆర్డర్ చేశాడు. రెండు నెలలు గడిచినా షర్టు రాలేదు. దీంతో సదరు కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేశాడు. వారు అతనిని బ్యాంక్ వివరాలను అడిగాడు. ఝంకర్ వారికి వివరాలు చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత అతని ఖాతా నుంచి 46 వేల 11 రూపాయలు డ్రా అయ్యాయి. నెల రోజుల క్రితం ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నిరంజన్ డెహ్రియా కూడా ఆన్‌లైన్‌లో రూ.86 వేల మేరకు మోసపోయారు. వీరంతా పోలీస్ స్టేషన్‌లో ఈ ఉదంతాలపై ఫిర్యాదు చేశారు. మరో ఉదంతంలో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డును యాక్టివేట్ చేస్తానని మోసగాళ్లు వినియోగదారునికి చెప్పారు. అతను మొబైల్‌లో వచ్చిన ఓటీపీ నంబరు చెప్పడంతో అతడి ఖాతా నుంచి డబ్బులు డ్రా అయ్యాయి. ఈ విషయమై బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసినా, తామేమీ చేయలేమని వారు తేల్చిచెప్పారు. 

Updated Date - 2021-11-04T17:35:05+05:30 IST