ఆరోగ్య శాఖలో ఆన్‌లైన్‌ రికార్డులు

ABN , First Publish Date - 2022-04-27T05:42:57+05:30 IST

వైద్యారోగ్య శాఖలోని కీలకమైన కార్యకలాపాలను ఆన్‌లైన్‌ చేయనున్నారు. ఇప్పటికే కొన్ని అంశాల ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక పోర్టల్‌లో న మోదవుతుండగా, మరో 21 అంశాలను కూడా ఆన్‌లైన్‌ లో నమోదు చేసేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆశ వర్కర్లకు స్మార్ట్‌ఫోన్‌లు అందించిన వైద్యారోగ్య శాఖ ఇక క్షేత్రస్థాయిలో కీలకమైన సే వలు అందిస్తూ పనిభారంతో ఒ త్తిడికి లోనవుతున్న ఏఎన్‌ ఎంల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.

ఆరోగ్య శాఖలో ఆన్‌లైన్‌ రికార్డులు
వైద్యారోగ్య శాఖలో అమలవుతున్న ప్రొగ్రామ్స్‌పై అవగాహన కల్పిస్తున్న దృశ్యం ( ఫైల్‌ )

ఏఎన్‌ఏంలకు 4జీ సిమ్‌లు

త్వరలో ట్యాబ్‌లు , మినీ ల్యాప్‌టాప్‌లు

పనిభారం తగ్గించేందుకు సంస్కరణలు 

ఆన్‌లైన్‌లో నమోదుతో మరింత పారదర్శకత

నిర్మల్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): వైద్యారోగ్య శాఖలోని కీలకమైన కార్యకలాపాలను ఆన్‌లైన్‌ చేయనున్నారు. ఇప్పటికే కొన్ని అంశాల ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక పోర్టల్‌లో న మోదవుతుండగా, మరో 21 అంశాలను కూడా ఆన్‌లైన్‌ లో నమోదు చేసేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆశ వర్కర్లకు స్మార్ట్‌ఫోన్‌లు అందించిన వైద్యారోగ్య శాఖ ఇక క్షేత్రస్థాయిలో కీలకమైన సే వలు అందిస్తూ పనిభారంతో ఒ త్తిడికి లోనవుతున్న ఏఎన్‌ ఎంల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.

జిల్లావ్యాప్తంగా సేవల విస్తరణ..

కొవిడ్‌ కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ సేవలతో మన్ననలు అందుకున్న ఏఎన్‌ఎంలకు పనిభారాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా లో మొత్తం 16 పీహెచ్‌సీలు, 3 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లతో పాటు జిల్లా ఆస్పత్రి ఉండ గా, మరో 3 అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లున్నాయి. 106 సబ్‌ సెంటర్‌లు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం 592 డాక్టర్‌ పోస్టులకు 569 మంది డాక్టర్‌లు పని చేస్తుండగా జిల్లాలో 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్యారోగ్య శాఖలో 591 మంది ఏఎన్‌ఎంలతో పాటు మిగతా సిబ్బందికి సంబంధించిన పోస్టులు మంజూరు కాగా 569 మంది పని చేస్తున్నారు. ఈ శాఖలో మరో 22 వివిధ రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

ఆచరణలోని వస్తే సేవలు సరళం

ఏఎన్‌ఎంలకు పేపర్‌ లెస్‌ వర్క్‌ అందుబాటులోకి తీసుకువస్తే 21 రకాల రికార్డులు ఇక సులువుగా ఆన్‌లైన్‌ కానున్నాయి. ఫీల్డ్‌కు వెళ్లే ఏఎన్‌ఎం లు ఇన్ని రికార్డులను మోయడం తలకు మించిన భారంలా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పనులను కూడా గ్రామీణ స్థాయిలో చేయాల్సి వస్తుండడం ఇబ్బందిగా మారింది. మాతా శి శు సంరక్షణ సేవలు, వ్యాక్సినేషన్‌, అంటువ్యాధులు, ఓపీ సేవల వంటి కార్యక్రమాలు గతంలో ఎక్కువగా చూసిన ఏఎన్‌ఎంలకు ఇటీవల అమలు చేస్తున్న కొ విడ్‌ సేవల అమలుతో పాటు జాతీయ అసంక్రమిత వ్యాధుల (ఎన్‌సీడీ) చర్య లు, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు వంటి కొన్ని కొత్త ఆరోగ్య కార్యక్రమాల బాధ్యత ఏఎన్‌ఎంపైనే పడింది. మే మొదటివారం నుంచి రాష్ట్రవ్యాప్తం గా ఏఎన్‌ఎంలు పేపర్‌ లెస్‌గా మారే అవకాశం ఉంది.

4జీ సిమ్‌కార్డులు..

గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవల విస్తరణకు ఆరోగ్య శాఖ తాజాగా అంతా ఆన్‌లైన్‌ విధానంలోనే పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రెండు రోజుల క్రితం కమిషనర్‌ వాకాటి కరుణ అన్ని జిల్లాల అధికారులతో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో క్షేత్రస్థాయి ఏఎన్‌ఎంలతోనూ మా ట్లాడారు. పనిభారం పెరిగినందున ఆన్‌లైన్‌ విధానం అమలు చేస్తే కలిగే లాభాల గుర్తిం చి ఆరోగ్య కార్యకర్తలకు పనిభారం తగ్గుతుందని ఈ సందర్భంగా కొంద రు ఏఎన్‌ఎంలు కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యా ప్తంగా ప్రతీ ఆరోగ్య కార్యకర్తకు ఇంటర్‌నెట్‌ సేవల్లో అంతరాయం కలగకుండా 4జీ నెట్‌వర్క్‌ సిమ్‌కార్డులు అందించాలని కమిషనర్‌ ఆదేశించిన ట్లు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్యాబ్‌లు అందజేసిన ఆ రోగ్య శాఖ భవిష్యత్‌లో 4జీ సిమ్‌లు సపోర్ట్‌ చేసే ట్యాబ్‌/మినీ ల్యాప్‌ట్యాప్‌లను అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. పేపర్‌ లెస్‌గా మార్చే ప్రయత్నంలో భాగంగా ఏ ఎన్‌ఎంలకు సరళమైన భాష అ ర్థమయ్యే రీతిలో 21 వరకు ఉన్న రికార్డులను ముద్రించి ఇవ్వాలని వాటి ఆధారంగా ఇకపై ట్యాబ్‌లలోనే సేవలు నిక్షిప్తం చేసే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రతీ ఏఎన్‌ఎంలకు 1000 నుంచి రూ. 1200 నిధులు ఇచ్చేందుకు కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నట్లు తె లుస్తోంది.

Updated Date - 2022-04-27T05:42:57+05:30 IST