Advertisement

ఆన్‌లైన్‌ షూటింగ్‌ లీగ్‌

Jun 30 2020 @ 03:21AM

 వచ్చేనెల 4న ప్రారంభం

 భారత్‌ నుంచి బరిలో ఇండియన్‌ టైగర్స్‌

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష క్రీడా ఈవెంట్లకు అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై అంతా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌ షూటింగ్‌ లీగ్‌కు తెర లేవనుంది. వచ్చే నెల 4 నుంచి జరిగే ఈ లీగ్‌లో ఆస్ట్రియన్‌ రాక్స్‌-ఇటాలియన్‌ స్టైల్‌ జట్ల మధ్య తొలి పోరు జరుగుతుంది. మరుసటి రోజు భారత్‌ తరఫున బరిలోకి దిగబోతున్న ఇండియన్‌ టైగర్స్‌ టీమ్‌ను ఇటాలియన్‌ స్టైల్‌ జట్టు ఎదుర్కోనుంది. ఫ్రెంచ్‌ ఫ్రాగ్స్‌, ఇజ్రాయెల్‌ మాబరోట్‌, స్పానిష్‌ కనోగ్‌ లీగ్‌లో పోటీపడుతున్న ఇతర జట్లు. జూలై 18, 19న సెమీఫైనల్స్‌.. 26న ఫైనల్‌ జరుగుతుంది. 25న మూడో స్థానం కోసం పోటీ ఉంటుంది.

Follow Us on:
Advertisement

క్రీడాజ్యోతిమరిన్ని...

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.