షాపింగ్‌ చేస్తూ రెట్టింపు డబ్బు సంపాదించుకొవచ్చని నమ్మించి..!

ABN , First Publish Date - 2021-09-14T17:17:24+05:30 IST

షాపింగ్‌ చేస్తూ రెట్టింపు డబ్బు సంపాదించుకొవచ్చంటూ...

షాపింగ్‌ చేస్తూ రెట్టింపు డబ్బు సంపాదించుకొవచ్చని నమ్మించి..!

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : షాపింగ్‌ చేస్తూ రెట్టింపు డబ్బు సంపాదించుకొవచ్చంటూ సైబర్‌ నేరగాళ్లు రూ. 66 వేలు మోసం చేశారు. టోలిచౌకికి చెందిన అబ్దుల్‌ సతార్‌ పార్ట్‌టైమ్‌ ఉద్యోగం కోసం ఇంటర్నెట్‌లో వెతుకుతున్నాడు. ఓ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయగా, ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. తమ వెబ్‌సైట్లో ఓ వస్తువు కొనుగోలు చేస్తే రెట్టింపు డబ్బు తిరిగి వస్తుందని ఇలా ప్రతి రోజు రూ.  500 నుంచి రూ. 5000  సంపాదించుకోవచ్చని చెప్పాడు. తొలుత రూ. వంద పెట్టుబడి పెట్టారు. ఇలా నాలుగుమార్లుకొనుగోలు చేయగా, కొంత డబ్బు వచ్చింది. తర్వాత అదే వ్యక్తి ఫోన్‌ చేసి, ఒకే సారి ఐదు వస్తువులు కొనుగోలు చేస్తే రెట్టింపు ఆదాయం వస్తుందని చెప్పాడు. దీంతో సత్తార్‌ రూ. 50 వేల వస్తువులు కొనుగోలు చేశాడు. అతనికి నాలుగు వేల రూపాయలు తిరిగి వచ్చాయి. మిగతావి రాలేదు. ఖాతా సీజ్‌ అయిందని చెప్పిన సైబర్‌ నేరగాడు రూ. 11 వేలు డిపాజిట్‌ చేస్తే, మొత్తం డబ్బు తిరిగి వస్తుందని చెప్పాడు. ఈమేరకు డబ్బు పంపిపాడు. మళ్లీ రూ. 5 వేలు  పంపిచాడు. డబ్బులు తిరిగిరాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి, బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-09-14T17:17:24+05:30 IST