శ్రీకాళహస్తిలో దర్శన వేళలు మళ్లీ కుదింపు

May 9 2021 @ 01:17AM

శ్రీకాళహస్తి, మే 8: శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం నుంచి రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు రద్దు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ ఉధ్రుతి పెరగడంతో భక్తుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆలయానికి భక్తులను కూడా ఉదయం 6 నుంచి 8గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తామన్నారు. నిత్యం ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు మొత్తం ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.