డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలి

ABN , First Publish Date - 2021-12-07T04:19:34+05:30 IST

మార్కెట్‌లో ఎక్కువ గా డింమాండ్‌ ఉన్న పంటలనే రైతులు సాగు చే యాలని కలెక్టర్‌ యాస్మిన్‌బాషా సూచించారు.

డిమాండ్‌ ఉన్న పంటలే సాగు చేయాలి
గోపాల్‌పేట ధాన్యం కొనుగోలు కేద్రం వద్ద రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

- యాసంగిలో పంటల మార్పిడి జరగాలి 

- 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలి

- ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ 

గోపాల్‌పేట, డిసెంబరు 6: మార్కెట్‌లో ఎక్కువ గా డింమాండ్‌ ఉన్న పంటలనే రైతులు సాగు చే యాలని కలెక్టర్‌ యాస్మిన్‌బాషా సూచించారు. గోపా ల్‌పేట, బుద్దారం, తాడిపర్తి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీ లించి మాట్లాడారు. యాసంగిలో ప్రతీ రైతు పంటల మార్పిడి  ఆరు తడి పంటలపై దృష్టి సారించాలని సూచించారు. యాసంగిలో వేరుశనగ, మినుములు, పెసర్లు, పొద్దుతిరుగుడు, వంటి పంటలు  సాగుచేస్తే అధిక లాభాలు వస్తాయని తెలిపారు.  వానాకాలం లో మండలంలో 12,608 ఎకరాల వరి, 4,428  ఎకరాల వేరుశనగ, 798 ఎకరాల మినుములు, 250 ఎకరాల కంది, పంటలను సాగు చేశారని తెలిపారు. ఈ సారి మొత్తం 18 వేల 84 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగుచేసేందుకు కృషి చేయాలన్నారు. కొ నుగోలు కేంద్రాల వద్ద రైతులను ఇబ్బంది పెట్ట కుండా చూడాలని అన్నారు. 

 వ్యాక్సినేషన్‌ వంద శాతం  పూర్తి చేయాలి

నేడు మరో కొత్త వైరస్‌ ఒమైక్రాన్‌ వైరస్‌ వచ్చే ప్రమాదం ఉందని, ప్రతీ ఒక్కరు అప్పమత్తంగా ఉం డాలని కలెక్టర్‌ తెలిపారు. ఆరోగ్యసిబ్బంది ఇంటింటికి తిరిగి 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్‌ వే యాలని తెలిపారు.  అనంతరం  గోపాల్‌పేట నర్సరీ ని పరిశీలించారు. నర్సరీలో మొక్కలు బాగా పెరిగా యని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎం పీపీ సంధ్య, జడ్పీటీసీ భార్గవి, సర్పంచ్‌లు శ్రీనివా సులు, పద్మమ్మ, గుండ్రాతి పద్మ, ఎంపీడీవో కరుణ శ్రీ, తహసీల్దార్‌ నరేందర్‌, డాక్టర్‌ మంజుల, ఐకేపీ ఏపీఎం సావిత్రి,  వ్యవసాయ  శాఖ జిల్లా అధికారి శివ నాగిరెడ్డి, ఏవో నరేష్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.   

ఈవీఎం గోదాంను పరిశీలించిన కలెక్టర్‌

వనపర్తి అర్బన్‌ : ప్రతీ నెలా నిర్వహించే సాధార ణ తనిఖీలో భాగంగా సోమవారం కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో ని ఈవీఎంల గోదామును పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ రాజేందర్‌ గౌడ్‌, ఎలక్షన్‌ సూప రింటెండెంట్‌ తదితరులు పాల్గొన్నారు.    


Updated Date - 2021-12-07T04:19:34+05:30 IST