పేదల ఆత్మగౌరవం కోసమే

ABN , First Publish Date - 2022-01-20T06:06:15+05:30 IST

పేదవారు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకం ప్రారంభించారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

పేదల ఆత్మగౌరవం కోసమే
వడ్డేపల్లిలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను ప్రారంభిస్తున్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే ఆల

- డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ప్రారంభంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల

- పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు


అడ్డాకుల, జనవరి 19 : పేదవారు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకం ప్రారంభించారని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కందూరు అనుబంధ గ్రామం వడ్డేపల్లిలో నిర్మించిన 36 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు అందజే శారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డం గుల చైర్మన్‌ సాయిచంద్‌, అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌, తహసీల్దార్‌ కిషన్‌, ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, స్థానిక సర్పంచు శ్రీకాంత్‌ పాల్గొన్నారు.


పేదోడికి అండగా కేసీఆర్‌ ప్రభుత్వం 


మూసాపేట : తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అందించి పేదోడి అండగా కేసీఆర్‌ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాసుగౌడ్‌ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని జానంపేట గ్రామంలో నిర్మించిన 80 డబుల్‌ బెడ్‌ రూంల ఇళ్లతోపాటు ఉన్నత పాఠశాలలో 43 లక్షలతో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి మంత్రి ప్రారం భించారు. కార్యక్రమంలో ఎంపీపీ గూపని కళావతి, జడ్పీటీసీ సభ్యులు ఇంద్రయ్యసాగర్‌, మండల రైతు బంధు అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్‌, టీఆర్‌ ఎస్‌ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహ్మ యాదవ్‌, పోల్కంపల్లి సింగిల్‌ విండో అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌లు శ్రీను వాసులు, స్వరూపా రాణి, నిర్మల, ఎంపీటీసీ నక్క ఆంజనేయులు, నాయకులు పాల్గొన్నారు.


అన్నాసాగర్‌లో ఘనస్వాగతం


భూత్పూర్‌ : దేవరకద్ర నియోజవ ర్గంలోని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించడానికి వస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీని వాస్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ సాయిచంద్‌ తది తరులకు స్థానిక ఎమ్మెల్యే ఆల తన స్వగ్రామ మైన అన్నాసాగర్‌లో ఘన స్వాగతం పలికారు. ఉదయం  వారికి పూల బొకేలను అందించి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంట్లో అల్పాహా రం తీసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజు గౌడ్‌, మండల రైతుబంధు అధ్యక్షుడు నర్సిములు గౌడ్‌,  నాయకులు నారాయణ గౌడ్‌, గోప్లాపూర్‌ సత్యనారా యణ, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.


ఇండోర్‌ స్టేడియం ప్రారంభం


చిన్నచింతకుంట : మండలంలోని అల్లీపురం గ్రామంలో గురువారం దాదాపు రూ.కోటీ 29 లక్షల వయ్యంతో నిర్మించిన ఇందిరమ్మ ఇండోర్‌ స్టేడి యంను రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణా స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్‌ సాయిచంద్‌, అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌లు ప్రారంభించారు. బ్యాడ్మింటన్‌ కోర్టులో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, గిడ్డంగుల చైర్మన్‌లతో పాటుగా అడిషనల్‌ కలెక్ట ర్‌లు బ్యాడ్మింటన్‌ ఆడారు. అనంతరం హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన బాడీ బిల్డర్లతో పోటీలు నిర్వహించారు. ఇందులో మిస్టర్‌ అల్లీపురంగా దేవరకద్ర మండలం గోప్లాపూర్‌కు చెందిన హరీష్‌ ఎంపిక వగా జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను, స్పోర్ట్స్‌ అథారి టీ చైర్మన్‌లను క్రీడాకారులు, నాయకులు సన్మానించారు. ఈ కార్యక్ర మం లో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌ రఘుగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోట రాము, వట్టెం రాము పాల్గొన్నారు.


యువతకు కిట్ల పంపిణీ


భూత్పూర్‌ మునిసిపాలిటీ, మూసాపేట మండలం చక్రాపూర్‌ గ్రామం లోని యువతకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన సొంత ఖర్చులతో క్రికె ట్‌ కిట్లను అందించారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్‌రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో యుతను ఉద్దేశించి ఎమ్మెల్యే పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.  ఈ కార్యక్రమంలో మునిసి పల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ యువత విభాగం అద్యక్షుడు గడ్డం ప్రేమ్‌కుమార్‌, మూసాపేటలో గ్రామ నాయకులు ప్రకాష్‌రెడ్డి, బాలయ్య, గ్రామ యువకులు పాల్గొన్నారు.





Updated Date - 2022-01-20T06:06:15+05:30 IST