ఇకపై ఆ సెక్టార్‌లో ప్రవాసులకు జాబ్బ్ ఇచ్చేదేలే.. తేల్చిచెప్పిన కువైత్!

Published: Fri, 25 Mar 2022 08:23:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇకపై ఆ సెక్టార్‌లో ప్రవాసులకు జాబ్బ్ ఇచ్చేదేలే.. తేల్చిచెప్పిన కువైత్!

కువైత్ సిటీ: స్థానికులకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో 2017లో కువైత్ సర్కార్ కువైటైజేషన్ పాలసీని తీసుకొచ్చింది. అప్పుడే ఐదేళ్లలో దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీతో ఆ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా సివిల్ సర్వీస్ కమిషన్(సీఎస్‌సీ) ప్రభుత్వ రంగ పరిధిలోని సంస్థలలో నాన్-కువైటీల నియామకాలపై కీలక ప్రకటన చేసింది. సీఎస్‌సీ రిజల్యూషన్ నం. 11 ఆఫ్ 2017 ప్రకారం ఇకపై ప్రభుత్వ సెక్టార్‌లోని సంస్థల్లో ప్రవాసులకు అవకాశం కల్పించొద్దని స్పష్టం చేసింది.

ఇకపై ఆ సెక్టార్‌లో ప్రవాసులకు జాబ్బ్ ఇచ్చేదేలే.. తేల్చిచెప్పిన కువైత్!

ఇటీవల ప్రభుత్వ పరిధిలోని అవ్కాఫ్, ఇస్లామిక్  వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి పలు పోస్టుల కోసం నాన్-కువైటీల భర్తీ విషయమై సీఎస్‌సీకి దరఖాస్తులు వచ్చాయి. వీటిని సీఎస్‌సీ బేషరతుగా తిరస్కరించింది. ఈ సందర్భంగా కువైటైజేషన్ పాలసీ లక్ష్యాన్ని సైతం గుర్తు చేసింది. అలాగే ఈ ఏడాది ఆగస్టు 26 నాటికి గడువు కూడా ముగియనుంది కనుక ఇకపై ప్రభుత్వ సెక్టార్‌లో ప్రవాసులను నియమించకూడదని తేల్చిచెప్పింది.  


ఇక అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు 2017 నుంచి కువైటైజేషన్ పాలసీని అమలు చేయడం ప్రారంభించాయి. దీంతో గడిచిన ఐదరేళ్లలో ఆ దేశంలో ప్రవాసుల సంఖ్య గణనీయంగా తగ్గడం మొదలైంది. ఇక తాజాగా వెలువడిన సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లలో ఈ సంఖ్య ఏకంగా 3.70లక్షలకు తగ్గడం గమనార్హం. 2018లో 2,891,255గా ఉన్న ప్రవాసుల సంఖ్య 2021 నాటికి 2,520,301కు పడిపోయింది. ఇదే సమయంలో వర్క్ పర్మిట్ల పొందిన వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. కేవలం 11వేల మంది మాత్రమే వర్క్ పర్మిట్లు పొందడం జరిగింది. 2018లో 1,07,657 మంది వలసదారులు వర్క్ పర్మిట్లు పొందితే.. 2021లో 96,800 మందికి మాత్రమే వర్క్ పర్మిట్లు దక్కాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.