Virat Kohli: అప్పుడు ఒక్కరు కూడా స్పందించలేదు.. ధోనీ మాత్రమే మెసేజ్ చేశాడు: కోహ్లీ

ABN , First Publish Date - 2022-09-06T01:13:28+05:30 IST

ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ ముగిశాక టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ

Virat Kohli: అప్పుడు ఒక్కరు కూడా స్పందించలేదు.. ధోనీ మాత్రమే మెసేజ్ చేశాడు: కోహ్లీ

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ ముగిశాక టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ (virat kohli) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ఓ కీలక విషయాన్ని పంచుకున్నాడు. తాను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోనీ (dhoni) ఒక్కడే తనకు మెసేజ్ చేశాడని, మిగతా ఎవ్వరూ స్పందించలేదని తెలిపాడు. 


‘‘నేను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ధోనీ (dhoni) నుంచి మాత్రమే మెసేజ్ వచ్చింది’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. ‘‘చాలామంది దగ్గర నా నంబరు ఉంది. కానీ ధోనీ ఒక్కడే మెసేజ్ చేశాడు. మీకు ఎవరితోనైనా నిజమైన గౌరవం, అనుబంధం ఉన్నప్పుడు ఇలాంటివి చూడగలుగుతారు’’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. నిజానికి ధోనీ పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేసే విషయంలో కోహ్లీ ఎప్పుడూ భయపడలేదు. అది ఐపీఎల్ గేమ్ గురించి అర్ధరాత్రి ట్వీట్ అయినా సరే, లేదంటే ప్రధాన పోటీకి ముందు ఇన్‌స్టా పోస్ట్ ఏదైనా సరే. తన భావాలను పంచుకుంటూ ఉంటాడు. భారత జట్టుకు కోహ్లీ కెప్టెన్ అయ్యాక కూడా ధోనీ, కోహ్లీ ఇద్దరూ కలిసిపోయారు. ఎప్పటికప్పుడు ఒకరినొకరు ప్రశంసించుకునేవారు.  


చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌ (pakistan)తో మ్యాచ్‌లో ఓ చెత్త షాట్ ఆడి అవుటయ్యానన్న కోహ్లీ.. తెల్లవారుజామున ఐదు గంటల వరకు మెలకువగా ఉంటూ సీలింగ్ వైపు చూస్తూ ఉండేవాడినని తెలిపాడు. ‘‘నా కెరియర్ ఇక ముగిసిపోయిందని అనుకున్నా. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. ప్రస్తుతం ఉన్న సానుకూల జట్టు వాతావరణానికి మేనేజ్‌మెంట్, కెప్టెన్ అర్హుడు. కాబట్టి, ఒకరు తన లోపాన్ని సొంతం చేసుకోవాలి. దానిని ఎదుర్కోవాలి’’ అని కోహ్లీ పేర్కొన్నాడు. 


 పాక్ కెప్టెన్ బాబర్‌పై ప్రశంసలు

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (babar azam)ను కోహ్లీ ప్రశంసించాడు. అతడు చాలా మంచి వ్యక్తి అని, తనకంటే చిన్నవాడని అన్నాడు. అతడిపై తనకు గౌరవం ఉందని, 2019 ప్రపంచకప్ తర్వాత నేర్చుకోవాలన్న తపన అతడిలో ఎక్కువైందని అన్నాడు. మంచి ఆటగాడని, కాబట్టి అతడు అన్ని ఫార్మాట్లలో రాణించడంలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నాడు. అతడి జట్టు సభ్యులు కూడా మంచి వారని ప్రశంసించాడు. రెండు జట్లు బాగా కలిసిపోయాయని కోహ్లీ పేర్కొన్నాడు.  

Updated Date - 2022-09-06T01:13:28+05:30 IST