ఒక ప్రాంతంలో ఒకే స్కూల్‌!

ABN , First Publish Date - 2021-07-25T08:53:20+05:30 IST

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని అధిగమించేందుకు, ప్రైవేటు స్కూళ్లను నిలబెట్టేందు కు యాజమాన్యాలు విలీనం బాట పట్టాయి. ఒక్కో ప్రాంతంలో ఉన్న రెండు, మూడు పాఠశాలలను ఒకటిగా మారుస్తున్నారు...

ఒక ప్రాంతంలో ఒకే స్కూల్‌!

  • కరోనా గండంతో ప్రైవేటు స్కూళ్ల విలీనానికి యాజమాన్యాల నిర్ణయం 
  • జీతాలు, అద్దెలు తగ్గించుకునే ప్రయత్నం
  • కరోనా గండాన్ని అధిగమించేలా కార్యాచరణ
  • ప్రభుత్వమూ ఆదుకోవాలని వేడుకోలు

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభాన్ని అధిగమించేందుకు, ప్రైవేటు స్కూళ్లను నిలబెట్టేందు కు యాజమాన్యాలు విలీనం బాట పట్టాయి. ఒక్కో ప్రాంతంలో ఉన్న రెండు, మూడు పాఠశాలలను ఒకటిగా మారుస్తున్నారు. ఈ ఏడాది ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల చేరిక భారీగా ప డిపోయింది. ఉన్న విద్యార్థులు కూడా ఫీజులు చెల్లించడంలేదు. దాంతో చాలా ప్రైవేట్‌ స్కూళ్లు మూత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైమరీ స్కూళ్లను తెరిచేందుకు అనుమతించవచ్చని ఇ టీవల ఐసీఎంఆర్‌ అభిప్రాయపడింది. దాంతో థర్డ్‌ వేవ్‌ లేకపోతే.. ఆగస్టు లేదా సెప్టెంబరు నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా.. వి ద్యార్థులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రై వేట్‌ పాఠశాలలు తిరిగి తమ కార్యకలాపాలను ఎలా ప్రారంభిస్తాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిన్న, మధ్య తరహా (బడ్జెట్‌) పాఠశాలలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. 


స్కూళ్లు నడవకుండానే పై తరగతికి.. 

గత ఏడాది స్కూళ్లు నడవకుండానే విద్యార్థులను ప్రమోట్‌ చేశారు. దాంతో ఈ ఏడాది ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గ ణనీయంగా తగ్గిపోయింది. కొందరు ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. దాంతో చాలా ప్రైవే ట్‌ పాఠశాలలు మూత దిశగా పయనిస్తున్నా యి. దీంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని రెండు మూడు స్కూళ్లు కలిపి ఒకే ప్రాంగణంలో ఒకే పాఠశాలగా నిర్వహించాలని నిర్ణయించారు. విలీనం ద్వారా ఈ అద్దె భారాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. దీంతోపాటు టీచర్లు, ఇతర సిబ్బందికి చెల్లించే జీతాల భారాన్ని కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 


రుణ సౌకర్యం కల్పించాలి

గత రెండేళ్లుగా వి ద్యార్థులు లేక, ఫీజులు వసూలు కాక, చాలా పాఠశాలల యాజమాన్యాలు భారీగా అప్పుల పాలయ్యాయి. ఈ అప్పులను తీర్చడానికి, ప్రైవేట్‌ స్కూళ్లను రక్షించడానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించాలి.  పరిస్థితులు సర్దుకున్న తర్వాత ఆరేళ్ల కాలపరిమితిలో ఈ రుణాలను తిరిగి చెల్లించే అవకాశం ఇవ్వాలి. 

- ఎస్‌ఎన్‌ రెడ్డి, ట్రస్మా ప్రధాన కార్యదర్శి

Updated Date - 2021-07-25T08:53:20+05:30 IST