పార్టీ విధేయుడికే అవకాశం

ABN , First Publish Date - 2022-10-01T06:06:44+05:30 IST

పార్టీకి విధేయుడిగా ఉండే వ్యక్తిని ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాలని తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడ్డారు.

పార్టీ విధేయుడికే అవకాశం
సమావేశంలో పాల్గొన్న టీడీపీ నాయకులు

ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీడీపీ నేతలు

అధిష్ఠానానికి ఆశావహుల జాబితా

విశాఖపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పార్టీకి విధేయుడిగా ఉండే వ్యక్తిని ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాలని తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమాశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. విశాఖ నుంచి  కార్పొరేటర్లు గాడు చినకుమారి లక్ష్మి, పల్లా శ్రీనివాసరావుతోపాటు ఈర్లె శ్రీరామమూర్తి, ఆడారి కిశోర్‌కుమార్‌లు ఎమ్మెల్సీ అభ్యర్థి కోసం దరఖాస్తు చేశారు. బలాబలాలతోపాటు పార్టీకి విధేయులగా ఉండే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్న నేతలు స్పష్టం చేశారు. పార్టీలో పనిచేసే వారికి మూడు జిల్లాల్లో నేతలతో పరిచయాలు ఉంటాయని, ఇది విజయావకాశాలకు ఎక్కువగా దోహదం చేస్తుందని పలువురు సూచించారు. అయితే దరఖాస్తు చేసిన నలుగురి వివరాలను అధిష్టానానికి పంపాలని సమావేశం తీర్మానించింది. వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై మూడు జిల్లాల్లో సీనియర్లతో మరోసారి చర్చించి శని లేదా ఆదివారం ప్రకటించాలని నిర్ణయించింది. సమావేశంలో అనకాపల్లి పార్లమెంట్‌ అధ్యక్షుడు బుద్దా నాగ జగదీశఽ్వరరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, అసెంబ్లీ ఇన్‌చార్జిలు గండి బాబ్జీ, విజయ్‌, కోరాడ రాజబాబు, పీలా గోవిందసత్యనారాయణ, ప్రగడ నాగేశ్వరరావు, వంగలపూడి అనిత, బత్తుల తాతయ్యబాబు, పీవీజీ కుమార్‌, గిడ్డి ఈశ్వరితోపాటు పార్టీ నాయకులు మణికుమారి, మహ్మద్‌ నజీర్‌, బండారు అప్పలనాయుడు, పాశర్ల ప్రసాద్‌, లొడగల కృష్ణ, పుచ్ఛా విజయకుమార్‌, ప్రణవ్‌గోపాల్‌, రాజమండ్రి నారాయణ, పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T06:06:44+05:30 IST