యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలి

ABN , First Publish Date - 2021-12-08T05:40:04+05:30 IST

యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలి

యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలి
కొత్తూరు: వైఎం తండాల్లో పత్తి పంటను పరిశీలిస్తున్న గీతారెడ్డి

కొత్తూరు/కడ్తాల్‌/తలకొండపల్లి/కందుకూరు/యాచారం/మొయినాబాద్‌ రూరల్‌:  యాసంగిలో రైతులు ఆరుతడి పంటలే వేసి లాభాలు పొందాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి సూచించారు. కొత్తూరు మండలంలోని ఏనుగుమడుగు తండాలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన యాసంగి పంటలపై అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు సూచనలు చేశారు. వ్యవసాయశాఖ అధికారుల సూచనలు పాటించి అధిక దిగుబడులు పొందాలన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ సహాయ సంచాలకులు రాజారత్నం, సర్పంచ్‌ బాత్లావత్‌ అరుణ, ఎంపీటీసీ డాకీ, మండల వ్యవసాయ అధికారి గోపాల్‌, ఏఈవో దీపిక, రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా కడ్తాల మండలంలోని మైసిగండి, రావిచెడ్‌, బాలాజీనగర్‌ తండా, చరికొండలో ఏవో శ్రీలత ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించారు. సర్పంచ్‌ తులసీరామ్‌ నాయక్‌, భారతమ్మ విఠలయ్యగౌడ్‌, కమ్లీ  పాల్గొన్నారు. అదేవిధంగా తలకొండపల్లి మండలంతో పాటు ఆర్లకుంట తండా, చుక్కాపూర్‌, అంతారం, వెంకటాపూర్‌,చీపునుంతల గ్రామాల్లో ఏవో రాజు ఆధ్వర్యంలో రైతులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు లలితజ్యోతయ్య, దాసరి కిష్టమ్మ, వెంకటయ్య, రమేశ్‌ యాదవ్‌, బండి రఘుపతి పాల్గొన్నారు. అదేవిధంగా కందుకూరులో మండల వ్యవసాయాధికారి యాదగిరి, ఏఈవో రాజులు రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ఏఈవోలు ఏ.ప్రియాంక, శ్రీహరి, కె.అర్చన, టి.ప్రభావతి, డి.రాఘవేంద్రాచారి పాల్గొన్నారు. అదేవిధంగా యాచారం మండలంలోని గ్రామాల్లో ఇబ్రహీంపట్నం డివిజన్‌ వ్యవసాయశాఖ ఏడీఏ సత్యనారాయణ రైతులకు ఆరుతడి సాగుపై అవగాహన కల్పించారు. మండల కేంద్రంలో 300 కిలోల పెసర విత్తనాలు సిద్ధం చేశామన్నారు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరల సాగుతో లాభాలు పొందవచ్చన్నారు. ఆయన వెంట ఏఈవో ప్రియాంక తదితరులున్నారు. అదేవిధంగా మొయినాబాద్‌ మండలంలోని నాగిరెడ్డిగూడ, పెద్దమంగళారం, చిన్నషాపురం, ఎన్కేపల్లి గ్రామాల్లోని రైతులతో మండల వ్యవసాయ అధికారి రాఘమ్మ సమావేశం నిర్వహించి అవగహన కల్పించారు. ఏఈవోలు సునీల్‌ కుమార్‌, కుమార్‌ రైతులు ఉన్నారు.

Updated Date - 2021-12-08T05:40:04+05:30 IST