రేపటి నుంచి రెండో డోసు వ్యాక్సిన్‌ మాత్రమే

ABN , First Publish Date - 2021-05-10T04:49:31+05:30 IST

జిల్లాలో మంగళవారం నుంచి ఈ నెలా ఖరు వరకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ మాత్రమే వేయనున్నట్టు కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. ఆదివారం ప్రత్యేకాధికారులు, వైద్యశాఖ అధికారులతో ఆయన టెలీకాన్ఫ రెన్స్‌ నిర్వహించారు. రెండో డోస్‌ వ్యాక్సిన్‌ నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

రేపటి నుంచి   రెండో డోసు వ్యాక్సిన్‌ మాత్రమే
మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 9: జిల్లాలో మంగళవారం నుంచి ఈ నెలా ఖరు వరకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ మాత్రమే వేయనున్నట్టు కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. ఆదివారం ప్రత్యేకాధికారులు, వైద్యశాఖ అధికారులతో ఆయన టెలీకాన్ఫ రెన్స్‌ నిర్వహించారు.  రెండో డోస్‌ వ్యాక్సిన్‌ నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టీకా కేంద్రాల్లో రద్దీ లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ‘ముందస్తుగా గదులను శానిటైజ్‌ చేయాలి. టీకాల కోసం వచ్చేవారిని ఆ గదుల్లో భౌతికదూరం పాటించేలా కూర్చొబెట్టాలి. వారివద్దకే వెళ్లి వ్యాక్సిన్‌ వేయాలి.  మొదటి, రెండో డోస్‌ కోసం బుక్‌చేసుకున్న వారి స్లాట్‌లను రద్దు చేస్తున్నాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సక్రమంగా టీకాలు వేసేలా ప్రణాళికలు రూపొందించాలి’ అని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్‌లు, వైద్యులు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-10T04:49:31+05:30 IST