షాద్‌నగర్‌లో ‘ఊకో కాక’ ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-01T04:40:02+05:30 IST

షాద్‌నగర్‌లో ‘ఊకో కాక’ ప్రారంభం

షాద్‌నగర్‌లో ‘ఊకో కాక’ ప్రారంభం
షాప్‌ను పరిశీలిస్తున్న సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌

  • పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌

షాద్‌నగర్‌ అర్బన్‌: షాద్‌నగర్‌-పరిగి రోడ్డులో నెలకొల్పిన ఊకో కాక బట్టల షాప్‌నుశనివారం రాత్రి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, బిగ్‌బాస్‌-3 విన్నర్‌, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ప్రారంభించారు. రాహుల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ‘ఊకో కాక’ షాపును ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్ట సర్పంచ్‌ ఎం.సాయిప్రసాద్‌యాదవ్‌, షాద్‌నగర్‌కు చెందిన ఎన్‌.హరిష్‌ కలిసి నెలకొల్పారు. ఎమ్మెల్యే, రాహుల్‌ దుకాణాన్ని పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. యువత అభిరుచికి తగ్గ దుస్తులను తక్కువ ధరలకు అందించాలనే తాను ‘ఊకో కాక’ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాహుల్‌ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, జడ్పీటీసీ పి.వెంకట్‌రాంరెడ్డి, అగ్గనూరి విశ్వం, ఎం.సంజీవయ్య, పి.చెన్నారెడి ,్డ శ్రీశైలంయాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:40:02+05:30 IST