ఊరూరా టీకా పండుగ

ABN , First Publish Date - 2021-06-21T06:46:55+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఆదివారం చేప ట్టిన కొవిడ్‌ వ్యాక్సినేషన శిబిరం విజయవంతమైంది. ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులు, ఫ్రంట్‌లైన వారియర్స్‌, 45 ఏళ్లు దాటిన వారికి టీకా మొదటి డోసు వేశారు.

ఊరూరా టీకా పండుగ
కూడేరులో వ్యాక్సినేషన రికార్డులు పరిశీలిస్తున్న జేసీ గంగాధర్‌ గౌడ్‌

మెగా కొవిడ్‌ వ్యాక్సినేషన డ్రైవ్‌ విజయవంతం

పర్యవేక్షించిన జేసీ, ఆర్డీఓలు


కూడేరు, జూన 20 : జిల్లావ్యాప్తంగా ఆదివారం చేప ట్టిన కొవిడ్‌ వ్యాక్సినేషన శిబిరం విజయవంతమైంది. ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులు, ఫ్రంట్‌లైన వారియర్స్‌, 45 ఏళ్లు దాటిన వారికి టీకా మొదటి డోసు వేశారు. పీహెచసీలు, గ్రామ సచివాలయాల వద్ద టీకా పండుగ సందడి నెల కుంది. జాయింట్‌ కలెక్టర్‌ గంగాధర్‌ గౌడ్‌ కూడేరు పీహెచ సీలో వ్యాక్సినేషన కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. వ్యాక్సిన న మోదు వివరాల రికార్డులను పరిశీలించారు. అక్కడి వైద్య సిబ్బందితో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వ్యాక్సినేషన కా ర్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఏఎనఎం అనసూయమ్మ, అంగనవాడీ వర్కర్లు నాగలక్ష్మి, కళావతి, నిర్మల త దితరులు పాల్గొన్నారు.


వ్యాక్సినతోనే కరోనా నియంత్రణ : విప్‌ 

రాయదుర్గం టౌన : వ్యాక్సినతోనే కరోనా వైరస్‌ నియంత్రణ సాధ్యమని ప్రభుత్వవిప్‌ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని దబ్బడి కాంప్లెక్స్‌ సమీపంలోని 5వ స చివాలయంలో ఆదివారం ప్రభుత్వం చేపట్టిన మెగా వ్యాక్సినేషనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కరోనా వ్యాక్సినపై అపోహలు వీడి అందరూ వ్యాక్సిన వేయించుకునేందు కు ముందుకు రావాలని కోరారు. కాగా పట్టణానికి 1570 టీకాలు రాగా, వాటిలో 1476 మందికి టీకాలు వేసి 94 శా తం లక్ష్యాన్ని చేరుకున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా తెలిపారు. పట్టణంలోని 18 సచివాలయాల పరిధి లో వ్యాక్సినేషన కొనసాగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన పొరాళ్లు శిల్ప, రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా అ ధ్యక్షురాలు కాపు భారతి, వైద్యఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 


కుందుర్పి: స్థానికంగా పలు సచివాలయాల్లో కొనసాగి న కరోనా వ్యాక్సినేషన ప్రక్రియను ఆదివారం ప్రత్యేకాధికారి శివయ్య పరిశీలించారు. 800 డోసుల టీకా రాగా 205 మం దికి టీకాలు వేసినట్లు తహసీల్దార్‌ ఈశ్వరమ్మ, వైద్యాధికారి అనుషా తెలిపారు. మిగిలిన వారికి కూడా టీకా అందిస్తామని తెలిపారు. 


వ్యాక్సినపై అపోహలు వీడండి 

యర్రగుంటలో సతీమణికి వ్యాక్సిన వేయించిన ఆర్డీవో 

కణేకల్లు : కరోనా వ్యాక్సినపై ప్రజలు అపోహలు వీడి ప్రతిఒక్కరు ప్రభుత్వం అందించే వ్యాక్సినను వేయించుకోవాలని కళ్యాణదుర్గం ఆర్డీవో నిశాంత రెడ్డి పేర్కొన్నారు. ఆ దివారం ఆయన కరోనా మెగా వ్యాక్సిన డ్రైవ్‌ను మండలంలోని యర్రగుంట పీహెచసీలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే సతీమణి సాయిదీపికి స్వయంగా యర్రగుంటలోనే వ్యాక్సిన వేయించారు. ప్రజలందరు వ్యాక్సినేషనకు ముందు కు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఉషారాణి, ఆర్‌ఐ గురుబ్రహ్మ, వీఆర్వో గోవిందరెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 


రాయదుర్గం రూరల్‌ : కరోనా థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ప్ర భావం చూపించే అవకాశం వుందని, ప్రతి చిన్నారి తల్లి కొ విడ్‌ టీకా వేయించుకోవాలని కళ్యాణదుర్గం ఆర్డీఓ నిశాంత రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని వేపరాల గ్రా మంలో కొవిడ్‌ మెగా వ్యాక్సినేషనను ఆయన ప్రారంభించారు. ఆవులదట్ల పీహెచసీ వైద్యులు రమేష్‌ మాట్లాడు తూ మండలంలో 839 మందికి కరోనా టీకాలు వేసినట్లు తెలిపారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం, సీడీపీవో ప్రభావతమ్మ, ఎంపీడీవో కొండయ్య, త నిఖీ చేశారు. కార్యక్రమంలో ఆవులదట్ల పీహెచసీ సూపర్‌వైజర్‌ పాతక్క, వీఆర్వోలు కృష్ణకీర్తి, ముకుంద, మాంతేష్‌, ఏఎనఎంలు ఆదిలక్ష్మీ, పార్వతి, కొల్లమ్మ, మారుతేశ్వరి, వి నోద్‌ కుమారి, అంగనవాడీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.  


కళ్యాణదుర్గం: కరోనా వ్యాక్సినేషనపై అపోహలు వద్దని ఆర్డీఓ నిశాంతరెడ్డికి సూచించారు. ఆదివారం మెగావాక్సినేషన డ్రైవ్‌లో భాగంగా కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన పరిధిలోని వివిధ సచివాలయాల్లో వ్యాక్సినేషన ప్రక్రియను ఆయన పరిశీలించారు. శెట్టూరు మండలం ఐదుకల్లులో ప్ర జలకు అవగాహన కల్పించారు. 


తాడిపత్రిలో 2800 మందికి వ్యాక్సిన

తాడిపత్రి టౌన : పట్టణంలో ఆదివారం 2800 మందికి కరోనా వ్యాక్సిన వేశామని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున తెలిపారు. స్థానిక ఆరోగ్య ఉపకేంద్రాలతో పాటు సచివాలయాల్లో వ్యాక్సినేషన కొనసాగిందన్నారు. 45 ఏళ్లు పైబడి న వారితోపాటు ఐదేళ్లఓపు వయసున్న పిల్లల తల్లులకు వ్యాక్సిన అందించామని ఆయన తెలిపారు. 


గుంతకల్లు టౌన : కరోనా వ్యాక్సినపై అపోహలు వద్ద ని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన వేయించుకోవాలని మున్సిపల్‌ చైర్‌పర్సన ఎన భవాని పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని సచివాలయం, అర్బన హెల్త్‌ సెంటర్ల లో వ్యాక్సినేషనను ఆమెతో పాటు వైస్‌ చైర్‌పర్సన మైమున, కమిషనర్‌ బండి శేషన్న పర్యవేక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజనీర్‌ విశ్వనాథ్‌, ఆర్వో నాసిర్‌ హుసేన, సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.


పామిడి: మండలంలో ఆదివారం నిర్వహించిన మెగా వ్యాక్సినేషన క్యాంపు విజయవంతమైంది. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని సచివాలయాల్లో వ్యాక్సిన కార్యక్రమాన్ని మండల అధికారులు సమన్వయంతో కొనసాగిం ది. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు 440 మందికి, 45 ఏళ్లు పై బడిన వారికి 653 మందికి, ఫ్రంట్‌లైన వర్కర్లు ముగ్గురికి వ్యాక్సిన వేసినట్లు వైద్యాధికారి రోహినాథ్‌ తెలిపారు. తహసీల్దారు సునీతబాయి, డీటీ ఉదయ్‌ భాస్కర్‌, ఈఓఆర్డీ  శ శికళ పర్యవేక్షించారు కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ సి బ్బంది, వలంటీర్లు, ఆశా, అంగనవాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


ఉరవకొండ: మండల వ్యాప్తంగా 1600 మందికి వ్యాక్సిన వేసినట్లు తహసీల్దారు మునివేలు ఆదివారం తెలిపారు.  పట్టణంలోని సచివాలయాల్లో జరుగుతున్న వ్యాక్సినేషనను ఆయనతో పాటు వైద్యులు ఎర్రిస్వామి రెడ్డి పరిశీలించారు. మధ్యాహ్నానికి సచివాలయాల్లో వ్యాక్సిన అయిపోవడంతో ప్రజలు వేచిచూడాల్సి వచ్చింది. తొలుత పేర్లు నమోదు చే సుకుని మరలా వ్యాక్సిన వేశారు. కౌకుంట్ల పీహెచసీ పరిధిలో 525 మందికి, రాకెటలో 500 మందికి, ఉరవకొండ సీహెచసీలో 600 మందికి వ్యాక్సిన వేశారు. 


విడపనకలు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యా క్సినేషనను ఆదివారం వైద్యుడు శ్రీధర్‌, ఎంపీడీఓ శ్రీనివాసు లు, తహసీల్దారు రజాక్‌వలి పర్యవేక్షించారు. కార్యక్రమంలో  వైద్యులు హరినాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ వలంటీర్లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.


వజ్రకరూరు: ప్రతిఒక్కరికీ వ్యాక్సిన అందిస్తామని వై ద్యులుజ్యోతిర్మయి, లక్షిదీప్తి పేర్కొన్నారు. ఆదివారం వ్యాక్సినేషన స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా స్థానిక పీహెచసీ పరిధిలో 400 మందికి, గడేహోతూరు పీహెచసీ పరిధిలో 326 మం దికి వ్యాక్సిన వేశామన్నారు.  


బెళుగుప్ప: మండలంలో 500 మందికి టీకాలు వేశామని డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ ఆదివారం తెలిపారు. కాలువపల్లిలో వ్యాక్సినేషనను ప్రోగ్రామ్‌ అధికారిణి సుజాత ఆకస్మి క తనిఖీ చేశారు. ప్రజలకు అవగాహన కల్పించి అర్హులంద రికి టీకా వేయాలని స్థానిక వైద్యాధికారులకు సూచించారు.  కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ వెంకటరమణ, ఏఎనఎంలు విజయలక్ష్మీ, స్వాతి, ఆశావర్కర్లు పాల్గొన్నారు. 


శెట్టూరు : మండల వ్యాప్తంగా ఆదివారం ఐదేళ్లలోపు పిల్లల తల్లులు 395 మందికి, 45 ఏళ్లు పైబడిన వారు 112 మందికి కరోనా వ్యాక్సిన వేసినట్లు వైద్యాధికారి రంగవేణి తెలిపారు. మిగిలిన వారికి కూడా వ్యాక్సిన వేస్తామన్నారు. 


బ్రహ్మసముద్రం: మండలంలో ఆదివారం నిర్వహించిన మెగా కరోనా వ్యాక్సినేషన ప్రక్రియను ఎంపీడీఓ రామకృష్ణ పరిశీలించారు. మండలవ్యాప్తంగా 600 మందికి టీకా వేసినట్లు వైద్యాధికారి రాజే్‌షకుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్‌ శివన్న, డిప్యూటీ తహసీల్దార్‌ విజయలక్ష్మీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


పుట్లూరు : మండలవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన కార్యక్రమాన్ని మండలస్థాయి అధికారు లు పరిశీలించారు. ఎంపీడీఓ నిర్మలాకుమారి మాట్లాడు తూ కరోనా టీకాను ప్రతిఒక్కరూ వేయించుకోవాలన్నారు. ఎలాంటి అపోహాలు పెట్టుకోరాదన్నారు. అనంతరం వైద్యాధికారిణి శ్రీవాణి పలు గ్రామాల్లో పర్యటించి కొవిడ్‌ టీకాలు వేశారు. వైద్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


పెద్దవడుగూరు : మండలంలో ఆదివారం నిర్వహించి న కరోనా వ్యాక్సినేషన కార్యక్రమాన్ని ఆర్డీఓ గుణభూషణ్‌రె డ్డి పరిశీలించారు. లక్షుంపల్లిలో ఆయన మాట్లాడుతూ  ప్ర తి ఒక్కరూ మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటించి కరోనా వైరస్‌ను అరికట్టడానికి సహకరించాలని కోరారు. ఆయన వెంట తహసీల్దార్‌ లక్ష్మినాయక్‌, ఎంపీడీఓ కుళ్లాయిస్వామి, డాక్టర్లు శ్రీనివాసబాబు, అమర్‌నాథ్‌, సిబ్బంది ఉన్నారు. 


యాడికి : మండలంలో 16 సచివాలయాల పరిధిలో చే పట్టిన కరోనా వ్యాక్సినేషన డ్రైవ్‌లో ఆదివారం 1615 మంది కి వ్యాక్సిన వేసినట్లు వైద్యాధికారులు ప్రవీణ్‌కుమార్‌, అప్ప య్య, సిరిచందన తెలిపారు. వ్యాక్సినేషన ప్రక్రియను తహసీల్దార్‌ అలెగ్జాండర్‌ పరిశీలించి మాట్లాడారు. 45 సంవత్సరాలు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులు వ్యాక్సినవేయించుకోవాలని సూచించారు. యాడికి ఆరోగ్యకేంద్రం ప రిధిలో వెయ్యిమందికి, రాయలచెరువు ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలో 615 మందికి వ్యాక్సిన వేశామన్నారు. 


బొమ్మనహాళ్‌ : పాలిచ్చే తల్లులకు టీకా ఇవ్వడం వల్ల వారి పిల్లలకు యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయని తహసీల్దార్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీడీవో సరస్వతి అన్నారు. ఐదేళ్ల లోపు పిల్లల తల్లులకు కొవిడ్‌ టీకా వేసేందుకు ప్రత్యేక డ్రై వ్‌ ఆదివారం నిర్వహించారు. బొమ్మనహాళ్‌, శ్రీధరఘట్ట పీ హెచసీ పరిధిలో 400 మందికి టీకా వేసినట్లు తెలిపారు.   కార్యక్రమంలో వైద్యాధికారులు వివేకానంద, సుల్తాన, హె ల్త్‌ అసిస్టెంట్‌ గోవర్దన, ఏఎనఎంలు జైనబ్బీ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 


 ‘థ్యాంక్యూ మోదీ’

గుంతకల్లు టౌన : దేశవ్యాప్తంగా వాక్సిన అందజేస్తున్న ప్రధాని మోదీకి బీజేవైఎం నాయకులు కృతజ్ఞతలు తెలిపా రు. పట్టణంలోని హెల్త్‌ సెంటర్ల వద్ద వ్యాక్సినేషనపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాయకులు మంజులా వెంకటేశ, ఎం కేశవ, రవీంద్ర, రవితేజ, సతీష్‌ చౌదరి, వడ్డే మహేష్‌, పవనకుమార్‌ పాల్గొన్నారు.


ఉరవకొండ : వ్యాక్సినేషన కార్యక్రమాన్ని సద్వినియో గం చేసుకోవాలని బీజేపీ నాయకులు మాదినేని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, పాతపేటలో వ్యాక్సినేషన సెంటర్లను ఆదివారం బీజేపీ నాయకు లు సందర్శించి మాట్లాడారు. వ్యాక్సినను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందన్నారు. కార్యక్రమంలో నాయకులు నిరంజనగుప్తా, సురేష్‌, అంజినేయులు పాల్గొన్నారు. 


కూడేరు : ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన అందిస్తున్న ప్రధా ని నరేంద్రీ మోదీ చిత్రపటానికి ఆదివారం స్థానిక పీహెచసీలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశా రు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, జి ల్లా ఉపాధ్యక్షులు కొనకొండ్ల రాజేష్‌, అశోక్‌రెడి, మంజునాథ్‌ నాయుడు, రామ్‌ఆదిత్య, ధనుంజయ, భార్గవ, మలోబులు, చంటి, మల్లికార్జున, వెంకటేష్‌ నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:46:55+05:30 IST