7న బహిరంగ వేలం

ABN , First Publish Date - 2021-12-05T05:26:55+05:30 IST

తలనీలాలు పోగుచేసుకునేందుకు, నిల్వ ఉన్న తలనీలాలు స్వాధీనం చేసుకునే హక్కుకోసం 7న ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

7న బహిరంగ వేలం

కదిరిఅర్బన్‌, డిసెంబరు 4: పట్టణంలోని ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాలు పోగుచేసుకునేందుకు, నిల్వ ఉన్న తలనీలాలు స్వాధీనం చేసుకునే హక్కుకోసం 7న ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 11-01-2022 నుండి 10-01-2023 వరకు ఒక సంవత్సరం పాటు ఈ హక్కు కల్గి ఉంటా రన్నారు. ఈ వేలంలో హిందూమతస్థులు మాత్రమే పాల్గొనాలన్నారు. తలనీలాలు పోగుచేసుకునే హక్కు రూ. 30 లక్షలు, సేకరించిన తలనీలాలు స్వాధీనం చేసుకోవడానికి రూ. 5 లక్షలు డిపాజిట్‌ చెల్లించాలన్నారు. అదేవిధంగా దేవస్థానం నిర్ణయించిన ప్రదేశం లో భక్తుల లగేజీ భద్రపరిచుకునే హక్కు కోసం 7న ఉదయం 11.30 గంటలకు బహి రంగ వేలం నిర్వహిస్తున్నామన్నారు. వేలంలో పాల్గొనదలచిన వారు రూ. 25 వేలు డిపాజిట్‌ చెల్లించాలన్నారు. అదేవిధంగా శ్రీవారి అనుబంధ సంస్థ అయిన శ్రీ ఉమా మహేశ్వర ఆలయం ఎదుట టెంకాయలు, పూజా సామగ్రి విక్రయించుకోవడానికి, పాదరక్షలు భద్రపరుచుకొనుటకు అదే రోజు వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. వేలం లో పాల్గొనదలచిన వారు రూ. 25 వేలు డిపాజిట్‌ చెల్లించాలన్నారు. 


Updated Date - 2021-12-05T05:26:55+05:30 IST