ఆ పుస్తకాలే నన్ను అటువైపు ఆకర్షించాయి.. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో గోరటి వెంకన్న

ABN , First Publish Date - 2021-12-31T02:10:31+05:30 IST

వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అత్యున్నత పురస్కారం వరించింది. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు.

ఆ పుస్తకాలే నన్ను అటువైపు ఆకర్షించాయి..  ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో గోరటి వెంకన్న

హైదరాబాద్: వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు అత్యున్నత పురస్కారం వరించింది. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించారు. ‘వల్లంకి తాళం’ కవితా గేయ రచనకు వెంకన్నకు అవార్డు ఇచ్చారు. 2021 సంవత్సరానికి గానూ కవిత్వ విభాగంలో వెంకన్నకు కేంద్ర సాహిత్య అవార్టు లభించింది. 2016లో తెలంగాణ ప్రభుత్వం వెంకన్నకు కాళోజీ పురస్కారం అందించింది. 2006లో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డును ప్రదానం చేసింది. అంతేకాకుండా తెలంగాణ పాటను విశ్వవ్యాప్తం చేసిన గోరటి వెంకన్నకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2019లో “కబీర్‌ సమ్మాన్‌’ పురస్కారం ప్రదానం చేసింది. 


గతంలో గోరటి వెంకన్న, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన జీవితం.. పాటల ప్రస్థానాన్ని వివరించారు. తన తల్లిదండ్రులే తనకు తొలి గురువులని చెప్పుకొచ్చారు. వారి ప్రేరణతోనే చిన్నప్పటి నుంచి పాటలపై ఆసక్తి కలిగిందని ఆర్కేతో పంచుకున్నారు. వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్నలోని సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలను తీసుకొచ్చి ఇచ్చారని, వాటి ప్రభావంతో వామపక్ష భావజాలానికి ఆకర్షితులయ్యాయని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో వెంకన్న వివరించారు. సాహిత్యం, పాటలు, రాజకీయాలు ఇలా అనేక విషయాలను ఆర్కేతో గోరటి వెంకన్న పంచుకున్నారు. (మీరు కూడా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వెంకన్న మాటలను పాటలను వీక్షించండి)

Updated Date - 2021-12-31T02:10:31+05:30 IST