తెరుచుకున్న సరళాసాగర్‌ సైఫన్స్‌

ABN , First Publish Date - 2022-08-10T05:18:41+05:30 IST

వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టు సైఫన్స్‌ తెరుచు కున్నాయి.

తెరుచుకున్న సరళాసాగర్‌ సైఫన్స్‌
సరళాసాగర్‌ సైఫన్స్‌ నుంచి విడుదల అవుతున్న నీరు


మదనాపురం, ఆగస్టు 9: వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టు సైఫన్స్‌ తెరుచు కున్నాయి. మానవ ప్రమేయం లేకుం డా ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నీరు చేరగానే ఆటోమెటిక్‌ సైఫన్‌ల ద్వారా నీటిని కిందికి వదలటం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. కాగా, జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు తోడుగా ఎగువ నుంచి వరద నీరు వస్తుండడంతో మంగళవారం మూడు వుడ్‌ సైఫన్లు, ఒక ప్రైమరీ సైఫన్‌ ఆటోమేటిక్‌గా ఓపెన్‌ అయ్యాయి. వీటిని చూసేం దుకు పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు బారులు కట్టారు. స్థానిక ఎస్సై మంజునాథ్‌రెడ్డి ఆధ్వ ర్యంలో పోలీసులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రాజెక్టు వద్ద బందోబస్తు నిర్వహించారు. 

 రాకపోకలు బంద్‌ 

మండలంలో ఊకశెట్టి వాగుకు వరద భారీగా వస్తుండడంతో ఆత్మకూర్‌-వనపర్తికి రాకపోకలు నిలి చాయి. సరళాసాగర్‌ సైఫన్స్‌ ఓపెన్‌ కావడంతో దాని నుంచి విడుదల అవుతున్న నీరు ఊకశెట్టు వాగులోకి కలుస్తుండడంతో మదనాపురం సమీపంలోని రహ దారిపై నీరు ప్రవహిస్తోంది. దీంతో రెవెన్యూ, పోలీస్‌ సిబ్బంది ప్రమాదాలు జరగకుండా రాకపోకలు నిలిపి వేశారు. 

 అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి

- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

సరళాసాగర్‌ సైఫన్స్‌ ఓపెన్‌ కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదేశిం చారు. మంగళవారం ఆయన ప్రాజెక్టు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వరదను ఎప్పటికప్పుడు సమీ క్షిస్తూ రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు. అలాగే, ప్రాజెక్టు దిగువన ఉన్న రైతులు వ్యవసాయ మోటర్లు పెట్టడానికి వెళ్లొద్దని సూచించారు. 

Updated Date - 2022-08-10T05:18:41+05:30 IST