బహిరంగ టెండర్‌ నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-04-18T05:05:43+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ అద్దె సమయం ముగిసిందని వెంటనే బహిరంగ టెండర్‌ పిలిచి తిరిగి అద్దె కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో శనివారం అసిస్టెంట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

బహిరంగ టెండర్‌ నిర్వహించాలి
వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

పెద్దపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 17: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ అద్దె సమయం ముగిసిందని వెంటనే బహిరంగ టెండర్‌ పిలిచి తిరిగి అద్దె కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యంలో శనివారం అసిస్టెంట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సీపెట్టి రవీందర్‌ మాట్లాడుతూ గతంలో అద్దెకున్న వారి సమయం 2018 నాటికి ముగిసి పోయిందన్నారు. వాటిని స్వాధీనం చేసుకోవాల్సిన కాలేజీ అధికారులు తిరిగి వారికే కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మూడేళ్ళు గడిచినా పాత వారే కొనసాగు తున్నారని వివరించారు. ఈ విషయం ఇంటర్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని వారు పేర్కొన్నారు. వెంటనే ఓపెన్‌ టెండర్లు పిలిచి షెటర్లను అద్దెకివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదికృష్ణ, అభిలాష్‌, ఖధీర్‌, కుమార్‌, చంద్రమౌళి, ఫారుఖ్‌, శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-04-18T05:05:43+05:30 IST