నిరుద్యోగుల సమస్యలపై గళం విప్పుతా

ABN , First Publish Date - 2021-03-01T04:35:08+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు.

నిరుద్యోగుల సమస్యలపై గళం విప్పుతా
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

- ఎమ్మెల్సీ స్వతంత్ర  అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌

నారాయణపేట క్రైం, ఫిబ్రవరి 28 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి  కృషి చేస్తానని ఎమ్మెల్సీ  స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అన్నారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని జీపీశెట్టి ఫంక్షన్‌హాల్‌లో గ్రాడ్యుయేట్స్‌తో జరిగిన ముఖా ముఖి కార్యక్రమానికి నాగేశ్వర్‌ హాజరై మాట్లాడారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఎన్‌.రాం చందర్‌రావు ప్రశ్నించే గొంతుకకాదని తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీ య పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిస్తే తిరిగి 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా రని, అలాంటప్పుడు వారిని ఎమ్మెల్సీగా గెలిపించి ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగుల పెన్షన్‌ విధానం అమలుపై తాను ప్రశ్నించే సమస్య సాధనకు కృషిచేస్తానన్నారు. రాజకీయ పార్టీల ఎమ్మెల్సీ అభ్యర్థులు తమకు ఇష్టమైన సమస్యలను ప్రశ్నిస్తారని, కష్టమైన సమస్యలను ఏనాడూ ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో నాయకులు సాగర్‌, వెంకట్రామిరెడ్డి, కాశీనాథ్‌, ప్రశాంత్‌, యాదగిరి, బాల్‌రాం పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:35:08+05:30 IST