కన్నికాపురం సీఎంసీ ఆస్పత్రి ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-26T19:54:15+05:30 IST

వేలూరు, జూన్‌ 25: రాణిపేట జిల్లా కన్నికాపురంలో సీఎంసీ ఆస్పత్రిని శనివారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. వేలూరు సీఎంసీ

కన్నికాపురం సీఎంసీ ఆస్పత్రి ప్రారంభం

ఆస్పత్రిని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌

వేలూరు, జూన్‌ 25: రాణిపేట జిల్లా కన్నికాపురంలో సీఎంసీ ఆస్పత్రిని శనివారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. వేలూరు సీఎంసీ ఆస్పత్రికి అనుబంధంగా 1,500 పడకలు, అత్యాధునిక శస్త్రచికిత్సా కేంద్రాలు, ఆపరేషన్‌ గదులు, బ్లడ్‌ బ్యాంక్‌ తదితర వసతులతో రాణిపేట సీఎంసీ ఆస్పత్రి నిర్మించారు. చెన్నై సచివాయలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆస్పత్రిని ప్రారంభించారు. సచివాలయంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి దురైమురుగన్‌, ఎంపీ జగద్రక్షకన్‌, సీఎంసీ డైరెక్టర్‌ డా.జేవీ పీటర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ డా.విక్రమ్‌ మాథ్యూస్‌ పాల్గొనగా, రాణిపేట ఆస్పత్రి ప్రాంగణంలో ఎమ్మెల్యే ఈశ్వరప్పన్‌, రాణిపేట జిల్లా కలెక్టర్‌ భాస్కర పాండ్యన్‌, ఎస్పీ డా.దీపసత్యన్‌, సీఎంసీ అధ్యక్షుడు పార్‌క్‌సవార్‌జీ, జాయింట్‌ డైరెక్టర్‌ జాన్‌మేమిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T19:54:15+05:30 IST