బాలల సంరక్షణకు ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’

Published: Tue, 28 Jun 2022 23:06:17 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బాలల సంరక్షణకు ఆపరేషన్‌ ముస్కాన్‌సమావేశంలో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ అచ్చేశ్వర్‌రావు

- అదనపు ఎస్పీ అచ్చేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌, జూన్‌ 28: జిల్లా వ్యాప్తంగా బాలల సంరక్షణకు ఆపరేషన్‌ ముస్కాన్‌-08 బృందాన్ని సిద్ధం చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం స్థానిక పోలీసు హెడ్‌ క్వార్టర్‌లోని సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బాల కార్మిక వ్యవస్థ సంపూర్ణంగా నిర్మూలన కావాలనే ఉద్దేశ్యంతో జిల్లా వ్యాప్తంగా రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జులై 1 నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమం నిర్వహించనున్నామని చెప్పారు. జరుగుతుందని బాలలను గుర్తిం రెస్క్యూ, ఆపరేషన్‌ నిర్వహించి తద్వారా పాఠశాలల్లో చేర్పించడం జరుగుతుందన్నారు. 1బాల కార్మికులను గుర్తించిన వారు డయల్‌ 100 లేదా 1098కు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీఓ మహేష్‌, ఎస్‌బీ సీఐ సుధాకర్‌, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్‌, సీసీఎస్‌ ఎస్సై సాగర్‌, కమ్యూనికేషన్‌ ఎస్సై సందీప్‌, ఐటీ సెల్‌ ఎస్సై సాగర్‌లు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.